ఎంపీగా ఉన్నప్పుడే రేవంత్ నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు

రేవంత్ రెడ్డి తన అబద్ధాలతో డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదన్నారు. రాజీనామా చేద్దామన్న తన సవాల్ [more]

Update: 2021-08-28 08:54 GMT

రేవంత్ రెడ్డి తన అబద్ధాలతో డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదన్నారు. రాజీనామా చేద్దామన్న తన సవాల్ కు రేవంత్ రెడ్డి స్వీకరించలేదని మల్లారెడ్డి చెప్పారు. ఏవో కొన్ని జిరాక్స్ పేపర్లు తీసుకొచ్చి తనను భూ కబ్జాదారుడిగా చిత్రీకరించాలని చూశారన్నారు. తన వద్ద ఉన్న భూములన్నీ సక్రమమైన పద్థతిలోనే కొనుగోలు చేశానని మల్లారెడ్డి తెలిపారు. పేద ప్రజల కోసమే తాను ఆసుపత్రిని నిర్మించామని తెలిపారు. తనను ఎంపీ అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. ఆరోజు చంద్రబాబుకు కూడా ఈ పేపర్లు చూపించానని మల్లారెడ్డి తెలిపారు. ఎవరికైనా సమయం వస్తుందని, ఆ సమయం వచ్చినప్పుడు చెబుతానని మల్లారెడ్డి హెచ్చరించారు. తన కోడలి పేరు మీద ఐదు ఎకరాలు కాదని, కేవలం 380 గజాల స్థలం మాత్రమే ఉందని మల్లారెడ్డి వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News