ఛార్జిషీట్ లో ఏముందనేది తేలనుందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీటులో ఏముందనేది ఈరోజు తేలనుంది. కేవలం అభిమానంతోనే జగన్ పై శ్రీనివాసరావు [more]

;

Update: 2019-01-25 03:37 GMT
nia chargesheet on jagan case
  • whatsapp icon

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీటులో ఏముందనేది ఈరోజు తేలనుంది. కేవలం అభిమానంతోనే జగన్ పై శ్రీనివాసరావు దాడి చేశారా? లేదా? మరేదైనా కుట్ర కోణం ఉందా? అన్నది నేడు తేలనుంది. శ్రీనివాసరావు జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండటంతో ఈరోజు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఎన్ఐఏ జగన్ పై దాడి కేసులో దాఖలు చేసిన ఛార్జిషీటును ఓపెన్ చేయలేదు. ఈరోజు విచారణ సందర్భంగా ఎన్ఐఏ ఛార్జిషీటును నేడు పరిశీలించనుంది. ఎన్ఐఏ విచారణలో ఏమి తేలిందనేది నేడు బయటకు రానుంది. ఉత్కంఠకు తెరపడనుంది.

Tags:    

Similar News