Kadapa : కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

కడప స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరయ్యాయి. కేంద్ర పర్యావరణ శాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప స్టీల్ [more]

Update: 2021-10-28 12:56 GMT

కడప స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరయ్యాయి. కేంద్ర పర్యావరణ శాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. పర్యావరణ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర పర్యావరణశాఖ నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర పర్యావరణ శాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది.

3,591 ఎకరాల్లో…..

కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని 3,591 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు 16,986 కోట్ల పెట్టుబడులు అవసరమని నిర్ణయించింది. ఏడాదికి మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కడప స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్మించాలని నిర్ణయించింది.

Tags:    

Similar News