Breaking : బాంబు బ్లాస్టయి మావోయిస్టు నేత మృతి

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. బాంబులను పరీక్షిస్తున్న సమయంలో అది పేలి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితమే రవి చనిపోయినట్లు మావోయిస్టు [more]

Update: 2021-11-13 06:33 GMT

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. బాంబులను పరీక్షిస్తున్న సమయంలో అది పేలి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితమే రవి చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ చెబుతోంది. రవి టెక్నికల్ టీంలో సభ్యుడుగా ఉన్నారు. కమ్యునికేషన్స్ తో పాటు ఎలక్ట్రానిక్స్ డివైజెస్ తయారు చేయడంలో రవి నేర్పరి.

ఏడాదిన్నర క్రితమే….

మావోయిస్టు కేంద్ర కమిటీలో రవి టెక్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. జార్ఖండ్ లో రవి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ వార్తను పోలీసులు ధృవీకరించారు. రవి చనిపోయిన ఏడాదిన్నర తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ ఈ ప్రకటన చేసింది. వారి కుటుంబ సభ్యులకు తెలియజేసింది.

Tags:    

Similar News