డేంజరస్ జర్నీ.. 11 గంటలు విమాన చక్రాలను పట్టుకుని గాల్లోనే ప్రయాణం

35 వేల అడుగుల ఎత్తు.. మైనస్ డిగ్రీల చలి.. 550 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న విమానం చక్రాలు పట్టుకుని 11 గంటలపాటు

Update: 2022-01-25 06:01 GMT

35 వేల అడుగుల ఎత్తు.. మైనస్ డిగ్రీల చలి.. 550 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న విమానం చక్రాలు పట్టుకుని 11 గంటలపాటు ప్రయాణించాడో వ్యక్తి. ఇంత డేంజరస్ జర్నీ చేసిన అతను ఇంకా ప్రాణాలతో ఉండటం అధికారులను బిత్తరపోయేలా చేసింది. విమానం ముందు చక్రాల క్యాబిన్ మధ్యలో కూర్చుని ప్రయాణించాడు అతను. అయితే అతను ఇంత సాహసం ఎందుకు చేశాడన్న విషయం మాత్రం అర్థం కాలేదు. నెదర్లాండ్స్ దేశంలోని ఆమ్ స్టర్ డామ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుందీ ఘటన.

అక్కడి ఎయిర్ పోర్టు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఇటలీకి చెందిన ఓ కార్గో విమానం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ నుంచి నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ షిపోల్ విమానాశ్రయానికి బయల్దేరింది. మార్గమధ్యంలో కెన్యాలోని నైరోబీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. 11 గంటల ప్రయాణం అనంతరం విమానం ల్యాండ్ అవ్వగా.. కొద్దిసేపటికి టైర్ల మధ్య ఓ వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. వెంటనే అధికారులకు సమాచారమివ్వగా.. అతను బ్రతికే ఉన్నాడని గ్రహించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ పోర్ట్ అధికారులు.. ఇలాంటి ప్రమాదకర ప్రయాణం చేసిన వ్యక్తులు బ్రతికిన సందర్భాలు లేవని.. అతని అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడని అన్నారు. అతను నైరోబీలో విమానం ఎక్కి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే నెదర్లాండ్ వచ్చేందుకు అతను అన్ని అనుమతులు తీసుకున్నాడని, మరి ఇలాంటి జర్నీ ఎందుకు చేశాడో తెలియడం లేదని తెలిపారు.




Tags:    

Similar News