బ్రేకింగ్ : నవయుగ కు షాక్

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు నుంచి తప్పుకోవాలని నవయుగ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలవరం హెడ్ వాటర్ వర్క్స్ పనులను నవయుగ [more]

;

Update: 2019-08-01 08:40 GMT
జగన్
  • whatsapp icon

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు నుంచి తప్పుకోవాలని నవయుగ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలవరం హెడ్ వాటర్ వర్క్స్ పనులను నవయుగ సంస్థ చేపట్టింది. మొత్తం మూడువేల కోట్ల రూపాయల విలువైన పనులను నవయుగ చేపట్టింది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగ సంస్థను తప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రీ క్లోజర్ నోటీసులు జారీ చేశారు. 2018 నవంబరులో చంద్రబాబు నవయుగ సంస్థకు పోలవరం ప్రాజెక్టుకు అప్పగించారు. దీంతో పోలవరం నిర్మాణ పనుల నుంచి నవయుగ తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags:    

Similar News