రైతు సక్సెస్ స్టోరీ.. ఆవు పేడను అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు!
వ్యవసాయం అంటే దండగా అన్న వారికి ఇదే మంచి ఉదాహరణ. వ్యవసాయంలో లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. అందుకే ఈ మధ్యకాలంలో చాలా..
వ్యవసాయం అంటే దండగా అన్న వారికి ఇదే మంచి ఉదాహరణ. వ్యవసాయంలో లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. అందుకే ఈ మధ్యకాలంలో చాలా మంది కరోనా తర్వాత సొంతూళ్లకు చేరుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. అలాగే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను వదిలిన కొందరు వ్యవసాయం చేసుకుంటూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. మన దేశంలో చాలా దాదాపు 80 శాతం వరకు అగ్రికల్చర్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారు చాలా మందే ఉన్నారు. పాలు అమ్ముకుని సంపాదించేందుకు కొందరుంటే.. గేదెలతో వ్యాపారం చేసేవారు మరి కొందరుంటారు. దేశంలో పాలు, దాని ఉత్పత్తులను విక్రయించడం ద్వారా చాలా మంది సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఓ రైతు కేవలం ఆవు పేడను అమ్మడం ద్వారా కోటీశ్వరుడు అయ్యాడంటే ఆశ్యర్యపోతారు. నిజమేనా అనే అనుమానం రాక మానదు. అవునండి ఇది నిజమే.
ఈ రైతు పేరు ప్రకాశ్ నెమాడే. ఇతనిది మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా సంగోలా తాలూకాలో ఉన్న ఇమ్దేవాడి గ్రామం. ఆవు పేడను అమ్మి కోటి రూపాయల విలువైన బంగ్లాను కూడా నిర్మించాడు కూడ అంతే కాదండోయ్ ఈ బంగ్లాకు ‘గోధన్ నివాస్’ అని కూఆ నామకరణం చేశాడు. ప్రకాష్ నెమాడే తనకు 4 ఎకరాల వంశపారంపర్యంగా వచ్చిన భూమి ఉంది. కానీ సరైన నీరు లేకపోవడంతో పంటలు పండించలేకపోతున్నాడు ప్రకాశ్. ఈ నేపథ్యంలో ఆవు పేడను అమ్ముతూ అధిక మొత్తంలో సంపాదిస్తున్నాడు. జీవనోపాధి కోసం ఆవుల పెంపకం ప్రారంభించాడు.
ఆ రైతు గతంలో ఒక ఆవు మాత్రమే ఉండేదట. ఇప్పుడు 150 ఆవుల వరకు ఉన్నాయి. ఆ తర్వాత పాలు అమ్ముతూ బాగా సంపాదించడం మొదలుపెట్టాడు. గతంలో ఒక ఆవు ఉన్న రైతు తీవ్రంగా శ్రమిస్తూ 150 ఆవుల వరకు పెంచుకున్నాడు. ఇప్పుడు స్మార్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారారు. ఇతను ఆవుల నుంచి వచ్చే పాలతో పాటు పేడను కూడా జమ చేసి వ్యాపారం కొనసాగిస్తున్నాడు.
ప్రకాశ్ ఆవు పేడను అమ్ముతూ కోట్లాది రూపాయలను గడిస్తుండటం ఇతన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు గ్రామస్తులు. వ్యవసాయం చేస్తున్న రైతుల వద్ద నుంచి ప్రకాశ్ ఆవు పేడను కొనుగోలు చేస్తూ ఆవు పేడ గ్యాస్ ప్లాంట్‌ను కూడా నిర్మించాడు. ఆవు పేడతో పాటు గ్యాస్ కూడా అమ్ముతున్నారు. గోవులకు ముసలితనం వచ్చే వరకు సేవ చేయడమే గొప్ప విషయమంటున్నారు రైతు. ఇప్పటి వరకు ఆవు పేడ వ్యాపారం ద్వారా కోటి రూపాయలకు పైగా సంపాదించాడు.