అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య

ఓ యువతి అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పూజ [more]

Update: 2020-04-09 12:22 GMT

ఓ యువతి అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పూజ అంబికా (21) తండ్రి ఏడుకొండలు, తల్లి శమంతకమణి దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. స్థానికంగా వీరు చందానగర్ రాజీవ్ స్వగృహ లో నివాసం ఉంటున్నారు. దంపతులిద్దరూ టైలరింగ్ చేస్తూ జీవనం గడిపేవారు. కాగా అంబిక బి.టెక్ కంప్యూటర్స్ చేస్తుంది. చదువుకుంటూనే మోతీలాల్ ఓస్వాల్ అనే ఆన్ లైన్ ట్రేడింగ్ కంపెనీ లో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తూ ఉంది. ఈరోజు ఉదయం అయిదున్నర గంటల ప్రాంతంలో అందరూ వాకింగ్ కి వెళ్లే సమయంలో రాజీవ్ స్వగృహ లోని తన అపార్ట్ మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు తెలియరావాల్సి ఉంది.

Tags:    

Similar News