తెలుగుపోస్ట్ టాప్ 10 వార్తలు (4-5-2023)

Update: 2023-05-04 12:35 GMT

MAY 4 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, గురువారం తిథి : శు.చతుర్దశి రా.11.40 వరకు నక్షత్రం : చిత్త రా.9.30 వరకు

పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


రద్దీ అంతగా లేదు... కారణమిదే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


అసలు నిందితులు దొరుకుతారా?

ఆయేషా మీరా కేసులో మరోసారి సీబీఐ విచారణ ప్రారంభించింది. హైదరాబాద్‌ సీబీఐ కేంద్రంగా దర్యాప్తు సాగుతుంది. ఈ కేసులో సత్యంబాబును నిర్దోషిగా కోర్టు తేల్చడంతో అసలు నిందితులను తేల్చేందుకు సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నిన్న అయేషా మీరా హాస్టల్ వార్డెన్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


భారీగా ధర పెరుగుదల

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. వాటి పెరుగుదల ఆగదు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం

పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


అత్యంత విషమంగా నటుడు శరత్ బాబు ఆరోగ్యం

టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 71 సంవత్సరాల శరత్‌బాబుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ (ఐసీయూ)లో ప్రత్యేక వైద్యబృందం చికిత్స అందిస్తోందని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయన త్వరగా కోలుకుంటారని ఏఐజీ ఆసుపత్రి ఆశాభావం వ్యక్తం చేసింది.

పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


వైసీపీపై వీర్రాజు ఫైర్

ఆంధప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తుందని సోము పేర్కొన్నారు.

పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


పైకి మామిడి కాయలు.. లోపల కరెన్సీ కట్టలు

ఎన్నికలంటేనే డబ్బుతో కూడుకున్నది. కోట్లు కుమ్మరించైనా గెలవాలనుకుంటారు అభ్యర్థులు. అందుకోసం అన్ని దారులు తొక్కుతారు. ఓటర్లకు చేరవేయాల్సిన డబ్బును అధికారుల కళ్లుగప్పి మరీ తరలించి రాత్రి వేళలో పంచుతుంటారు.

పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇకపై వారానికి ఐదు రోజులు పనిదినాలుగా నిర్ణయించనునంది.

పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. వసంత విహార్‌లో నిర్మించిన కొత్త భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు.

పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఎవడు పడితే వాడడిగితే ఇస్తామా?

ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఘాటు రిప్లై ఇచ్చారు. తమకు పరిశ్రమ నుంచి నంది అవార్డులు ఇవ్వాలంటూ ఎవరూ ప్రతిపాదనలు ఇవ్వలేదని తలసాని తెలిపారు. వచ్చే ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరుపున నంది అవార్డులు ఇస్తామని తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.

పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Similar News