తెలుగుపోస్ట్ టాప్ 10 వార్తలు (6-5-2023)

Update: 2023-05-08 13:40 GMT
బంగాళాఖాతంలో అల్పపీడనం.. పెరగనున్న ఉష్ణోగ్రతలు
బంగాళాఖాతం పై ఉన్న ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతం, ఆ పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో ఈ అల్పపీడనం మే 9కి (రేపు) వాయుగుండంగా కేంద్రీకృతమై.. ఆ తర్వాత ఉత్తర దిశగా పయనిస్తూ.. తుపానుగా బలపడుతుందని పేర్కొన్నారు. తుపాను ఉత్తర దిశగా కదిలితే ఇటువైపునున్న తేమంతా అటు వెళ్లడంతో.. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా పెరుగుతాయని తెలిపారు.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


కేరళలో ఘోర ప్రమాదం: 22 మంది మృతి

కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తాపడి 22 మంది మరణించారు. కేరళలోని మలప్పురంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తానూరులోని కెట్టుంగల్ బీచ్ వద్ద టూరిస్ట్‌లతో వెళుతున్న బోటు బోల్తా పడటంతో 22 మంది మరణింాచరు. నిన్న రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రిజల్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపు విడుడల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు రేపు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డులో ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిసింది.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి



ఇళ్ల మధ్యలో కూలిన విమానం
రాజస్థాన్‌లో మిగ్ 21 విమానం కుప్పకూలింది. ఇళ్ల మధ్యలో కూలడంతో ఇద్దరు మృతి చెందారు. హనుమాన్‌ఘర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విమానం సూరత్ నుంచి టేకాఫ్ అయినట్లు సమాచారం.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సర్ణదేవాలయం వద్ద వరుస పేలుళ్లు
పంజాబ్‌లోని అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద వరస బాంబు పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. వరసగా నిన్న రాత్రి, ఈరోజు ఉదయం గోల్డెన్ టెంపుల్‌కు అతి సమీపంలో ఈ బాంబు పేలుడు జరిగింది.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం అందింది. జర్మనీలోని బెర్లిన్‌లో జరిగే ఆసియా బెర్లిన్ సదస్సుకు రావాలని ఆహ్వానం అందింది. ఈ సదస్సు వచ్చే నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ బెర్లిన్‌లో సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ ను నిర్వాహకులు ఆహ్వానం అందించారు.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెల్లవారితే పెళ్లి.. అక్క భర్తతో పెళ్లికూతురు జంప్
తెల్లవారితే పెళ్లి.. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కూతురిని అత్తారింటికి సాగనంపేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఇల్లంతా చుట్టాలు, మామిడి తోరణాలు, ఇంటిముందు పచ్చని పందిరితో కళకళలాడుతోంది.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


విద్యార్థులందరూ సేఫ్‌గా
మణిపూర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ చిక్కుకున్న విద్యార్థులను ప్రత్యేక విమానంలో తీసుకు వచ్చారు. వీరంతా హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇంఫాల్ నుంచి 106 మంది విద్యార్థులు రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు వచ్చారు.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదే మా యూత్ డిక్లరేషన్
తెలంగాణలో యూత్ డిక్లరేషన్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. సరూర్‌ నగర్‌ స్టేడియంలో జరిగిన నిరుద్యోగ సంఘర్షణ సభలో ఆయన ప్రసంగించారు. విశ్వవిద్యాలయాలు ఉద్యమానికి చిహ్నాలుగా నిలిచాయని రేవంత్ రెడ్డి అన్నారు.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


బీఆర్ఎస్‌ను తరిమికొట్టండి
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తరిమికొట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని ప్రియాంక గాంధీ కోరారు. జైబోలో తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మిత్రులారా అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

















Similar News