అఖిల్.. మోనాల్ కి స్పెషల్ విషెస్

గత ఏడాది స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 4 అనగానే అందులో విన్నర్ అభిజిత్ గుర్తుకు రావడం అటుంచి.. ప్రేమ పక్షులుగా ప్రాజెక్ట్ అయిన [more]

Update: 2021-05-16 09:14 GMT

గత ఏడాది స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 4 అనగానే అందులో విన్నర్ అభిజిత్ గుర్తుకు రావడం అటుంచి.. ప్రేమ పక్షులుగా ప్రాజెక్ట్ అయిన అఖిల్ – మోనాల్ గజ్జర్ లే గుర్తుకు వస్తారు. వారి మధ్యన సం థింగ్ సం థింగ్ అనేది అందరూ చూసారు. వాళ్ళు గప్ చుప్ గా ఉన్నా వాళ్ళ మధ్యన ప్రేమాయణం నడిచింది అనేది బిగ్ బాస్ ద్వారా స్టార్ మా బుల్లితెర ప్రేక్షకులకి కనెక్ట్ చేసింది. మోనాల్ – అఖిల్ మధ్యన బాండింగ్ ప్రేమ అనేలానే ఉంది. అయితే బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాకా ఈ జంట బాగా పాపులర్ అయ్యింది. అఖిల్ తో మోనాల్ ఓ వెబ్ సీరీస్ చేస్తుండగా.. అఖిల్ హీరోగా ఒక సినిమా మొదలయ్యింది. ఇక మోనాల్ ఐటెం సాంగ్స్ అలాగే స్టార్ మా డాన్స్ ప్లస్ షో లో అందాలు ఆరబోస్తూ బిజీ అయ్యింది.

తాజాగా మోనాల్ తన పుట్టిన రోజు ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో మోనాల్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటుగా చాలామంది విషెస్ చెప్పారు. అందులో అఖిల్ సార్థక్ చెప్పిన విషెస్ మాత్రం స్పెషల్ గా ఉన్నాయి. అఖిల్.. మోనాల్ కి విషెస్ చెబుతూ రాణులకు సంబంధించి చాలా కథలు విన్నా.. కానీ రియల్ లైఫ్ రాణి మాత్రం నువ్వే అంటూ మోనాల్ పై ప్రేమని కురిపించడంతో ఈ జంట మరోసారి హైలెట్ అయ్యింది. అలాగే మోనాల్ ని వర్ణించడానికి తాను వాడిన పదాలు చాలా చిన్నవి అని, ఆ పదాలను మించి వర్ణించడం తన వల్ల కావడం లేదని, అసలు మోనాల్ లాంటి వ్యక్తిని పరిచయం చేసినందుకు బిగ్ బాస్ షోకు థాంక్స్ చెప్పేసాడు అఖిల్.

Tags:    

Similar News