మా పేషీలో ఒకరికి కరోనా.. మంత్రి ఆళ్ల నాని

మా పేషీలో అటెండర్ కు కరోనా వైరస్ సోకిందని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఒక అటెండర్ కు కరోనా సోకడంతో అందరికీ వైద్య [more]

Update: 2020-04-29 14:30 GMT

మా పేషీలో అటెండర్ కు కరోనా వైరస్ సోకిందని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఒక అటెండర్ కు కరోనా సోకడంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. తనతో సహా పేషీలోని సిబ్బంది మొత్తానికి వైద్య పరీక్షలు నిర్వహించారని, వారందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆళ్ల నాని చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ప్రతిరోజూ ఆరు నుంచి ఏడువేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు.

Similar News