నేను చెప్తా.. అప్పటివరకు కాస్త ఆగండి!!

అమల పాల్ రెండో పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. దర్శకుడు విజయ్ తో ప్రేమ పెళ్లి పెటాకులయ్యాక అమల పాల్ సింగల్ గానే [more]

;

Update: 2020-04-24 02:55 GMT
amala paul
  • whatsapp icon

అమల పాల్ రెండో పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. దర్శకుడు విజయ్ తో ప్రేమ పెళ్లి పెటాకులయ్యాక అమల పాల్ సింగల్ గానే ఉంటుంది అనుకున్నారు. కానీ అమల పాల్ మాత్రం బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు.. ఆ విషయాన్నీ కన్ఫర్మ్ కూడా చేసింది. ఆమల పాల్ అలా ఆందో లేదో అమల పాల్ రెండో పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడం, తర్వాత అవి డిలీట్ చెయ్యడం జరిగినా.. అమల పాల్ రెండో పెళ్లి వ్యవహారం పై అప్పటికే జరగాల్సిన రచ్చ జరిగిపోయింది.

అయితే అమల పాల్ అది తన రెండో పెళ్లి కాదని, ఓ యాడ్ షూట్ కోసం చేసిన షూట్ అంటూ ఏదో చెప్పింది. తాజాగా తన రెండో పెళ్లిపై మాట్లాడిన అమల పాల్ తన పెళ్ళికి ఇంకాస్త సమయం ఉందని.. ప్రస్తుతం తాను చాలా సినిమాల్తో బాగా బిజీగా ఉన్నా అని.. ఆ సినిమాలు పూర్తయ్యాకే తన సెకండ్ మ్యారేజ్ ఉంటుంది అని.. అప్పుడు పెళ్లిపై ప్రకటన చేస్తా అని అంతవరకు తన పెళ్లిపై వచ్చే ఏ వార్తను నమ్మొద్దు అంటూ తన సెకండ్ లవ్ గురించి పెళ్లి గురించిన ముచ్చట్లు బయటపెట్టింది. అయితే తాను మాత్రం ప్రేమలో ఉన్న విషయం మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. 

Tags:    

Similar News