దీనిపైన సుప్రీంకోర్టుకు…?

ఇంగ్లీష్ మీడియం విద్య పై ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిన జీవోలను పైన ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు [more]

Update: 2020-06-05 01:43 GMT

ఇంగ్లీష్ మీడియం విద్య పై ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిన జీవోలను పైన ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ప్రజల అభీష్టం మేరకే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేశామంటూ పిటిషన్ లో పేర్కొంది అంతేకాకుండా 80 శాతానికి పైగా ప్రజలు ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారని ప్రభుత్వం వేసిన పిటిషన్ లో తెలిపింది. హైకోర్టు రద్దు చేసిన జీవోలను వెంటనే పునరుద్ధరించాలని కోరింది. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఇంగ్లీష్ మీడియంపై అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు జీవోలు 81, 85 లను జారీ చేసింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ కొంతమంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదప్రతివాదాలు విన్న తర్వాత రెండు జీవోలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. పేద విద్యార్థుల కోసమే ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి చేస్తున్నామన్న ప్రభుత్వం పేర్కొంది. . మాతృభాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. 80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్‌ మీడియాన్ని కోరుకుంటున్నారని .. ప్రజల ఆకాంక్షల కొరకే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేశామని పిటిషన్ లో పేర్కొంది. ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News