సాహో బడ్జెట్ ఎంతో చెప్పిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ కలిసి నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఇక ఈచిత్రంను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిచిన సంగతి తెలిసిందే. [more]

Update: 2019-08-13 07:30 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ కలిసి నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఇక ఈచిత్రంను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిచిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో రూపొందిన ఈమూవీ కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ చాలామంది పని చేసారు. ఇక ఈచిత్రం వరల్డ్ వైడ్ గా ఆగస్టు 30 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

అయితే మొదటి నుండి ఈసినిమా 350 కోట్లు తో తెరకెక్కుతోందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై సాహో టీం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ లేటెస్ట్ ప్రభాస్ ఈ సినిమా బడ్జెట్ విషయంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ” ఈ సినిమా బడ్జెట్‌ అక్షరాల రూ. 350 కోట్లు అని.. ఇది ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్ కాదని.. ఇది ప్రస్తుతం నడిచే కథ అని, సినిమాలో కొన్ని పార్ట్స్‌ ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయని” చెప్పారు.

ఈసినిమాను మూడు భాషల్లో చిత్రీకరించారు. టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అన్ని ఏరియాస్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిపోయింది. యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు

Tags:    

Similar News