తీర్పు రెడీ….క్యాంపులు కూడా…?

కర్ణాటకలో ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడు పార్టీలు హోరాహోరీ పోరాడాయి. జనతాదళ్ ఎస్ పన్నెండు స్థానాల్లో [more]

;

Update: 2019-12-05 18:29 GMT

కర్ణాటకలో ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడు పార్టీలు హోరాహోరీ పోరాడాయి. జనతాదళ్ ఎస్ పన్నెండు స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పదిహేను నియోజకవర్గాల్లో బరిలోకి దిగాయి. పన్నెండు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ కొత్త వారిని బరిలోకి దించింది. జనతాదళ్ ఎస్ కొన్ని చోట్ల స్వతంత్రులకు, మరొక చోట కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది.

తిరిగి పవర్ ను…?

ఉప ఎన్నికల ఫలితాలు కర్ణాటక రాజకీయాల్లో కీలకంగా మారాయి. భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఎనిమిది స్థానాలను గెలుచుకోక తప్పని పరిస్థితి. అయితే పరిస్థితులు బీజేపీకి అంత సానుకూలంగా లేవన్నది సర్వేలు చెబుతున్న నిజం. బీజేపీీ నాలుగైదు స్థానాలకు మించి కైవసం చేసుకోవలేదంటున్నారు. అదే జరిగితే బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమనే చెప్పాలి. అందుకోసమే బీజేపీ ఆపరేషన్ కమల్ ను మరోసార తెరపైకి తెచ్చింది. మరికొందరు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ గూటికి రప్పించే ప్రయత్నాలను ప్రారంభించింది.

విశ్వాసంతో కాంగ్రెస్…..

ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయన్న విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జారిపోకుడా జాగ్రత్తలు తీసుకుంది. ఈనెల 9వ తేదీన ఫలితాలు వెలువడుతుండటంతో పోలింగ్ ముగిసిన వెంటనే కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించనుంది. జేడీఎస్ సయితం తమ ఎమ్మెల్యేలను బెంగళూరుకు సమీపంలో ఒక రిసార్ట్ లో ఉంచేందుకు సిద్దమయింది. ఎన్నికల ఫలితాల తర్వాత అధికార మార్పిడి ఖాయమన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

వీరే దెబ్బతీస్తారా?

బీజేపీకి అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలే ప్రతిబంధకంగా మారారు. పార్టీ ఫిరాయింపులను నియోజకవర్గ ప్రజలు ప్రోత్సహిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు బీజేపీకి రెబల్స్ బెడద కూడా తీవ్రంగా ఉంది. వీటిని అధిగమించి యడ్యూరప్ప తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ఇక కాంగ్రెస్, జేడీఎస్ లు అత్యధిక సీట్లు సాధిస్తే సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నాయి. మొత్తం మీద కర్ణాటకలో మరో నాలుగురోజుల్లో యడ్యూరప్ప భవితవ్యం తేలనుంది.

Tags:    

Similar News