ఒక్కడితోనే సరా…?
విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ (వీఎంఅర్డీయే) చైర్మన్ గా ద్రోణంరాజు శ్రీనివాస్ నియమితుడై అపుడే రెండు నెలలు దాటాయి. ఇప్పటికైతే బోర్డ్ నియామకం మాత్రం జరగలేదు. [more]
;
విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ (వీఎంఅర్డీయే) చైర్మన్ గా ద్రోణంరాజు శ్రీనివాస్ నియమితుడై అపుడే రెండు నెలలు దాటాయి. ఇప్పటికైతే బోర్డ్ నియామకం మాత్రం జరగలేదు. [more]
విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ (వీఎంఅర్డీయే) చైర్మన్ గా ద్రోణంరాజు శ్రీనివాస్ నియమితుడై అపుడే రెండు నెలలు దాటాయి. ఇప్పటికైతే బోర్డ్ నియామకం మాత్రం జరగలేదు. పూర్తి స్థాయి బోర్డు ఉంటేనే తప్ప కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుపడదు. చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తో పాటు, అరడజన్ మందికి పైగా డైరెక్టర్లు, అధికారులు, అనధికారులు బోర్డులో ఉంటారు. డైరెక్టర్లను పార్టీ నాయకుల నుంచే ఎంపిక చేస్తారు. వీఎంఅర్డీయే చైర్మన్ తో పాటు డైరెక్టర్లకు పొలిటికల్ గ్లామర్ చాలానే ఉంది. మొత్తం అయిదు జిల్లాలకు విస్తరించిన బోర్డ్ కావడం విశాఖ రియల్ ఎస్టేర్ రంగానికి కీలకమైన నగరం కావడంతో డైరెక్టర్ గా పదవి దక్కినా చాలు అనుకుంటున్న వారు వైసీపీలో చాలామంది ఉన్నారు.
ఆగిన నియామకాలు…
జగన్ మనసులో ఏముందో తెలియదు కానీ తమకు బోర్డులో డైరెక్టర్ పదవి కావాలని నగరంలోని వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు, ఆ మాత్రం పలుకుబడి ఉన్న వారంతా కోరుకుంటున్నారు. మరి జగన్ ఇప్పటివరకూ ఆ దిశగా ఆలోచనలు చేయలేదని పార్టీ వర్గాల సమాచారం, ఇక అయిదు జిల్లాలకు విస్తరించి ఉన్న బోర్డులో డైరెక్టర్లు కూడా ఆయా ప్రాంతాల వారిని తీసుకుని సమగ్రమైన రూపు ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. అలా చూసుకుంటే విశాఖ నుంచి ఒకరిద్దరికి మాత్రమే చాన్స్ ఉంటుంది. విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలకు ఒక్కో డైరెక్టర్ పోస్ట్ ఉంటుందని చెబుతున్నారు. జగన్ ఇపుడు నామినేటెడ్ పదవుల జోలికి పోవడం లేదని అంటున్నారు. ముంగిట్లో లోకల్ బాడీ ఎన్నికలు ఉంచుకుని ఒకరికి పదవి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే గొడవలు ముదిరి పార్టీకి చేటు తెస్తాయని కూడా జగన్ భావిస్తున్నారని అంటున్నారు.
అదే సంప్రదాయమా…?
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2007 టైంలో అప్పటి విశాఖ నగరాభివృధ్ధి సంస్థకు కేవలం చైర్మన్ని మాత్రమే నియమించి కధ నడిపించారు. బోర్డు పూర్తి స్థాయిలో లేకుండానే రెండేళ్ల పాటు విశాఖ కాంగ్రెస్ నేత రవిరాజు పదవిని నిర్వహించారు. ఆ తరువాత బోర్డు కాలపరిమితి ముగిసింది. కొత్త బోర్డు నియమించకుండానే ఎన్నికలు రావడం, వైఎస్సార్ చనిపోవడంతో తరువాత సర్కార్ కూడా ఉమ్మడి ఏపీలో బోర్డ్ చైర్మన్ని నియమించలేదు. చంద్రబాబు సైతం తన పదవీ కాలంలో బోర్డ్ కి చైర్మన్లను నామినేట్ చేయలేదు. దాంతో ఎంతో మంది తమ్ముళ్ళు ఆశపెట్టుకుని మరీ వెనక్కు తగ్గాల్సివచ్చింది. ఇక జగన్ వస్తూనే బోర్డ్ కి చైర్మన్ గా ద్రోణంరాజు శ్రీనివాస్ ను వేసారనుకుంటే డైరెక్టర్ల నియామకం లేకుండా ఉంది. లోకల్ బాడీ ఎన్నికల తరువాత పూర్తి బోర్డ్ ని నియమిస్తారనుకుంటే అప్పటివరకూ ద్రోణంరాజు శ్రీనివాస్ ఒకే ఒక్కడుగా ఉంటారేమో.