komatireddy : అంతా రెడీ అయ్యారట… ఆ షరతుతో ఆగారట
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరేందుకే సిద్ధమవుతున్నారు. ఆయన కాంగ్రెస్ లో పొసగలేక పోతున్నారు. అయితే బీజేపీలో ఇప్పటికిప్పుడు చేరితే ఎమ్మెల్యే [more]
;
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరేందుకే సిద్ధమవుతున్నారు. ఆయన కాంగ్రెస్ లో పొసగలేక పోతున్నారు. అయితే బీజేపీలో ఇప్పటికిప్పుడు చేరితే ఎమ్మెల్యే [more]
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరేందుకే సిద్ధమవుతున్నారు. ఆయన కాంగ్రెస్ లో పొసగలేక పోతున్నారు. అయితే బీజేపీలో ఇప్పటికిప్పుడు చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటంుది. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ఇదే షరతు పెట్టింది. దీంతో వచ్చే ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
పార్టీకి దూరంగా….
ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తన నియోజకవర్గమైన మునుగోడుకే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే కొంత కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉండేవారు. అయితే అది కూడా జరగకపోవడంతో ఆయన బీజేపీలో చేరిక దాదాపు ఖాయమయిందనే చెప్పాలి.
భవిష్యత్ లేదని….
బీజేపీకి తెలంగాణలో భవిష్యత్ ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నమ్ముతున్నారు. కేసీఆర్ ను ఎదుర్కొనే సామర్థ్యం బీజేపీకే ఉందని ఆయన అంటున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ కోలుకునే అవకాశమే లేదన్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంచనా. దీనికి తోడు పార్టీ భవిష్యత్ కంటే నేతల వ్యక్తిగత ప్రయోజనాలే కాంగ్రెస్ లో ఎక్కువని, దీనివల్ల కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లోనూ కనీసస్థాయిలో గెలవలేదని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది.
ఈటలకు మద్దతుగా…
ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ కే ఆయన పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని కూడా చెబుతున్నారు. ఆర్థికంగా మాత్రమే కాకుండా తన ముఖ్య అనుచరుల్లో కొందరిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హుజూరాబాద్ కు ీఈటలకు మద్దతుగా పంపినట్లు తెలిసింది. మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని దాదాపుగా తేలిపోయింది.