కోండ్రు డైలామా కంటిన్యూ ?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ నేత కోండ్రు మురళీ మోహనరావు ఏం చేస్తున్నారు అంటే జవాబు చెప్పడం కష్టమే. ఆయన 2019 ఎన్నికల వేళ [more]
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ నేత కోండ్రు మురళీ మోహనరావు ఏం చేస్తున్నారు అంటే జవాబు చెప్పడం కష్టమే. ఆయన 2019 ఎన్నికల వేళ [more]
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ నేత కోండ్రు మురళీ మోహనరావు ఏం చేస్తున్నారు అంటే జవాబు చెప్పడం కష్టమే. ఆయన 2019 ఎన్నికల వేళ రాజాం నుంచి పోటీ చేసి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు చేతిలో ఓడిపోయారు. నాటి నుంచి ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ మధ్య విశాఖకు రాజధాని అని వైసీపీ అంటే మద్దతుగా మాట్లాడి టీడీపీ హై కమాండ్ ఆగ్రహానికి గురి అయ్యారు. ఇక కోండ్రు మురళి కి జిల్లా టీడీపీ నేతలతో పెద్దగా సంబంధాలు లేవు అంటారు. ఆయన్ని పార్టీలోకి తీసుకువచ్చిన మాజీ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు పరిస్థితే ఇపుడు పార్టీలో ఏమీ బాగులేదు. దాంతో కోండ్రు మురళి ఫుల్ సైలెంట్ అయ్యారని టాక్.
ఎగదోస్తున్నారా ..?
మరో వైపు చూస్తే రాజాం సీటు మీద మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కన్ను వేశారు. తన కుమార్తె గ్రీష్మకు ఇక్కడ టికెట్ ని ఆమె అడుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూతురుకి టికెట్ ఇస్తే గెలిపించుకునివస్తాను అంటున్నారు. ఆమెకు ఇక్కడ బాగా పట్టుంది. గతంలో ఆమె ఇక్కడ నుంచి పోటీ చేసి బాగానే ఓట్లు తెచ్చుకున్నారు. అయితే పార్టీలో వెన్నుపోట్లు కారణంగానే తాను ఓడిపోయాను ఆమె భావిస్తారు. ఇక ఆమెకు ఇపుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు నుంచి మద్దతు లభిస్తోందిట. దాంతో ఆమె కుమార్తెకి టికెట్ గ్యారంటీ అంటూ ప్రచారం అయితే సాగుతోంది. దీంతో కోండ్రు మురళికి టీడీపీ టిక్కెట్ వచ్చే ఎన్నికల్లో అనుమానమేనంటున్నారు.
అలెర్ట్ అయ్యారా …?
తాజాగా కోండ్రు మురళీ మోహన్ మీడియా ముందుకు వచ్చారు. దేవినేని ఉమ అరెస్ట్ ని ఆయన గట్టిగానే ఖండించారు. వైసీపీ సర్కార్ మీద మెత్తమెత్తగా విమర్శలు చేశారు. మాట్లాడితే గొంతు నొక్కుతారా అంటూ కామెంట్స్ కూడా చేశారు. దీని వల్ల తాను టీడీపీలో యాక్టివ్ గా ఉన్నాను అన్న సందేశాన్ని ఆయన పంపించగలిగారు అంటున్నారు. అయితే ఆయనకంటూ వర్గం టీడీపీలో పెద్దగా లేదని చెబుతున్నారు. ఇక టీడీపీ నేతలు కూడా ఈ కాంగ్రెస్ మాజీ మంత్రికి దూరం అయ్యారని కూడా టాక్ నడుస్తోంది. మరి కోండ్రు మురళి టీడీపీలో కొనసాగుతారా అన్న డౌట్లు కూడా ఇంకా తమ్ముళ్లకు ఉన్నాయట.
వైసీపీ వైపే ..?
అయితే కోండ్రు మురళి చూపు మాత్రం వైసీపీ వైపు ఉందని అంటున్నారు. ఆయన గతంలోనే టీడీపీలో చేరాలి. కానీ రాజాం నుంచి కంబాల జోగులు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడంతో జగన్ టికెట్ కి హామీ ఇవ్వలేదు అని చెబుతారు. ఇక ఇప్పటికి మూడు సార్లు వరసగా పోటీ చేసి రెండు సార్లు గెలిచిన జోగులు మీద జనంలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. దాంతో పాటు ఆయన కూడా జనాలతో కనెక్షన్లు పెట్టుకోవడం తగ్గించేసారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో కొత్త ముఖాలను తీసుకువద్దమనుకుంటున్న వైసీపీకి కోండ్రు మురళి ఒక ఆప్షన్ గా ఉంటారని అంటున్నారు. కోండ్రు మురళి కనుక వైసీపీ వైపు వస్తే గెలుపు ఖాయమన్న మాట ఉంది. మొత్తానికి ఆయన ఏ సంగతీ తేల్చరు, అలాగని పార్టీలో లేనూ అని చెప్పరు. దీంతో తమ్ముళ్ళకు ఈ మాజీ మంత్రి వల్ల అతి పెద కన్ఫ్యూజన్ గా ఉందిట.