తెలంగాణలో ఎన్నికల జోష్ పెరిగిపోయింది. వివిధ పార్టీల నేతలు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో అగ్రనేతల పర్యటనలు, బహిరంగ సభలు, నేతల ప్రచారాలతో పార్టీలో జోష్ ఉండేలా ప్లాన్‌లు చేస్తున్నారు. నేతల భేటీలు పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. నిన్న రాత్రి ఢిల్లీలో ఆయన షాతో భేటీ అయ్యారు. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని లోకేష్ అమిత్ షాకు వివరించారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసు అంటూ తప్పుడు కేసులు పెట్టి నెల రోజుల నుంచి జైలులో ఉంచి వేదిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో నలుగురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు.
దసరా అంటే ముందుగా గుర్తుకొచ్చేది విజయవాడ ఇంద్రకీలాద్రి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ తల్లిని దసరా నవరాత్రుల్లో దర్శించుకోవడం పుణ్యంగా భావిస్తారు. మరో నాలుగు రోజుల్లో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల్లో రోజుకో అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
ఏపీ సీఎం కార్యాలయం మార్పునకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. విశాఖకు షిప్ట్ అయ్యేందుకు పనులు చకచక జరిగిపోతున్నాయి. అయితే విశాఖకు షిప్టింగ్ అయ్యేందుకు మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ జీవోను విడుదల అయింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మండి పడ్డారు. సామర్లకోటలో జరిగిన బహిరంగ సభో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కుప్పం నియోజకవర్గంలో పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. ఆయన దోచుకోవడానికే సమయం వెచ్చించారని అన్నారు.
బీఆర్ఎస్ గుర్తులతోనే ఇబ్బంది ఎదురవుతుంది. ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తున్న గుర్తులు కారు పార్టీకి శాపంగా మారుతున్నాయి. కొన్ని గుర్తులు కారు గుర్తును పోలి ఉండటంతో ఓటర్లు తికమకపడి వాటిపై వేస్తున్నారని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది.
భారతీయ చలన చిత్రసీమలో అమితాబ్ బచ్చన్, చిరంజీవి ఇద్దరు లెజెండ్స్ గా ఎదిరిగారు. ఇక ఈ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అది ఫ్యాన్స్ కి కన్నుల పండుగ అనే చెప్పాలి. గతంలో వీరిద్దరూ కలిసి ‘సైరా’ మూవీలో నటించారు. రియల్ లైఫ్ లో అమితాబ్ ని గురువుగా భావించే చిరంజీవి..
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనంలో కార్యకలాపాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ భవనానికి మొత్తం 6 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ ఆరుగే్ట్లకు జంతువుల పేర్లను పెట్టారు. ఒక్కో గేటుకు ఒక్కో అర్థం వచ్చేలా జంతువుల పేర్లను పెట్టారు. మరి వాటి అర్థం ఏంటో తెలుసుకుందాం.
చంద్రబాబు అంగళ్లు బెయిల్ పిటీషన్ పై విచారణ ముగిసింది. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. రేపు దీనిపై తీర్పు ప్రకటించనుంది. చిత్తూరు జిల్లాలో అంగళ్లు వద్ద పోలీసులపై జరిగిన దాడి కేసులో చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.