కాంగ్రెస్ గెలుస్తామన్న ఊపులో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. గతంలో కల్లా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ కు మెరుగైన పరిస్థితులున్నాయన్నది కాదనలేని వాస్తవం. అయితే గెలిచేటంతగా అంటే చెప్పలేం. ఫిఫ్టీ ...ఫిఫ్టీ ఛాన్స్. సర్వేలు అధికభాగం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగానే వస్తున్నాయి.
Venkatesh - Mahesh Babu : విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనే కాదు బయట కూడా పెద్దోడు, చిన్నోడు లాగానే ప్రవర్తిస్తుంటారు. ఇద్దరు అన్నదమ్ములలా చాలా సరదాగా కలిసి మెలిసి ఉంటారు. ఇటీవల వెంకటేష్ కూతురి ఎంగేజ్మెంట్ జరగగా.. ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, మహేష్ బాబు మాత్రమే హాజరయ్యారు.
ప్రాణం ఉన్నంత వరకూ తాను భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని పార్టీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. తాను పార్టీ మారతానన్న ప్రచారం జరుగుతందని, అందులో వాస్తవం లేదని ఆమె తెలిపారు. తాను బీజేపీలోనే ఉంటానని చెప్పారు. పార్టీలో ఉంటూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని డీకే అరుణ తెలిపారు.
తెలంగాణలో గెలుపు అవకాశాలు ఉండటంతో పార్టీ హైకమాండ్ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అగ్రనేతలు వరస పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ అనేక సార్లు వచ్చి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సోనియా గాంధీ వచ్చి ఆరు గ్యారంటీలను విడుదల చేశారు.
కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 8న నామినేషన్ వేయనున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డిలో పోటీ చేయనున్నారు. ఈ నెల 6న కొడంగల్ లో నామినేషన్ వేసిన తర్వాత 8వ తేదీన కామారెడ్డిలో ఆయన తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయనున్నారు.
Anasuya : టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ ఇండస్ట్రీలో యాంకర్ గా, నటిగా మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియా ట్రోల్స్ తో మరింత వైరల్ అవుతుంటుంది. యందొక విషయంలో అనసూయ ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది. అయితే ఈ ట్రోల్స్ చేసేటప్పుడు కొంతమంది నెటిజెన్స్.. ఆమెను 'ఆంటీ' అనే పదంతో కామెంట్స్ చేస్తుంటారు.
టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్.. ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తెలుగు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాడు. కానీ ఆ తరువాత హీరోగా టర్నింగ్ తీసుకోని కామెడీకి దూరమయ్యి.. అటు హీరో ఛాన్సులు, ఇటు కమెడియన్ ఛాన్సులు కూడా అందుకోలేక ఇబ్బందులు పడ్డాడు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తూ అనేక ఫొటోలను షేర్ చేస్తుంటారు. అందులో చాలా వరకూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కవ ఫాలోయిర్స్ ఉండటంతో పార్టీ విజయానికి తాను చేసే పనులను నెటిజన్లతో కేటీఆర్ ఎప్పటికప్పుడు పంచుకుంటుంటారు.
సీపీఎం పథ్నాలుగు మందితో జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ తో పొత్తు ఖరారు కాకపోవడంతో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమయింది. పథ్నాలుగు స్థానాలను అభ్యర్థులను ప్రకటించింది. పాలేరులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోట ీ చేయనున్నారు.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గన్‌తో కాల్చుకుని ఏఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటన స్ఠలాన్ని పరిశీలించారు.