టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-10-18 12:45 GMT


మా ఆవిడతో ఇలా రావడం మొదటిసారి.. మహేష్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ కపుల్‌ మహేష్ బాబు, నమ్రతా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'వంశీ' సినిమాలో కలిసి పని చేసిన ఈ ఇద్దరు.. ప్రేమించుకొని 2005లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నలుగురు టాలీవుడ్ లో స్టార్స్ అనే చెప్పాలి.

షాకింగ్ : చంద్రబాబు బెయిల్ పిటీషన్ వాయిదా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణను వాయిదా వేసింది. నవంబరు 7వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో పటీషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఏపీ సర్కార్ రికార్డు.. ఒక్కరోజులోనే మూడు లక్షల మందికి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక రికార్డు సృష్టించింది. ఒకే రోజు మూడు లక్షలకు మందికి పైగా ప్రజలకు వైద్య సేవలు అందించింది. ఏపీలో జనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

మొదలైన ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 షూటింగ్.. లీకైన పిక్స్..

మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్, బాలీవుడ్ యాక్షన్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమా 'వార్ 2'. గతంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'వార్'కి ఇది సీక్వెల్ గా రాబోతుంది. అంతేకాదు బాలీవుడ్ స్పై యూనివర్స్ లో భాగంగా టైగర్, పఠాన్ చిత్రాల వరుసలో ఈ మూవీ కూడా తెరకెక్కుతుంది.

పాక్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు

వరల్డ్ కప్ లో అంచనాలకు విజయాలు అందడం లేదు. చిన్న జట్టు కూడా బలమైన జట్టును మట్టికరిపిస్తుంది. మొన్న ఆప్ఘనిస్తాన్ జట్టు ఇంగ్లండ్ ను ఓడిస్తే తాజాగా నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికా జట్టుకు షాకిచ్చింది. ఈ పరిస్థితుల్లో మైదానంలో ఎవరిది పై చేయి అన్నది ముందుగా తేలే పరిస్థితి లేదు.

దసరా నాటికి ప్రభాస్ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి కామెంట్స్..

రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే ప్రశ్న.. ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిపోయింది. ఈ మ్యారేజ్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు టాలీవుడ్ లోని చాలా మంది ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. వీరంతా ఎంతలా ఎదురు చూస్తున్నారంటే.. ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదని,

20న దుర్గగుడికి జగన్

ఈ నెల 20న విజయవాడలోని ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్నారు. అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతిరోజూ ఒక అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

రాహుల్ ట్వీట్.. తెలంగాణలో అడుగుపెడుతూనే

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగుపెడుతూనే ట్వీట్ చేశారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ఆయన ట్వీట్ చేశారు. అభివృద్ధి గ్యారంటీ పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు చెల్లాయి అంటూ ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీని సాధారణ సెలవుగా, 24వ తేదీని ఆప్షనల్ హాలిడేగా ఇంతకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా 24వ తేదీని ఆప్షనల్ హాలిడే బదులు సాధారణ సెలవుగా మార్చింది.

నేడు గవర్నర్ వద్దకు టీడీపీ

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను నేడు తెలుగుదేశం సభ్యుల బృందం కలవనుంది. చంద్రబాబు అరెస్ట్‌తో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ కు వివరించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు రాజ్‌భవన్ అపాయింట్‌మెంట్ లభించింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించనుంది.

Tags:    

Similar News