టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-10-02 12:32 GMT

ప్రపంచంలోనే మన విస్కీయె టాప్...

భారతదేశంలో తయారైన విస్కీని ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ బ్రాండ్‌గా విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ ఎంపిక చేసింది. 'ఇంద్రి దీపావళి కలెక్టర్ ఎడిషన్ 2023' ప్రపంచంలోని అతిపెద్ద విస్కీ-టేస్టింగ్ పోటీలలో ఒకటైన 'డబుల్ గోల్డ్ బెస్ట్ ఇన్ షో' అవార్డును అందుకుంది.

గాంధీజీ నివసించిన కుటీరం.. ఎన్నో ఆసక్తికర విషయాలు

భారత దేశం గర్వించదగిన మహనీయులలో మహాత్మా గాంధీ ఒకరు అని చెప్పేకంటే.. అందరికంటే ముందుంటారు అని చెప్పొచ్చు. భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్య్రం అందించడం కోసం చేసిన పోరాటానికి గాంధీజీ ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు.. యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది.
ఆదాయం పెంచుకునేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మేలుకువలు నేర్చుకుంటే మంచి రాబడి అందుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో కూడా మంచి లాభాలు పొందవచ్చు.

ప్రజ్ఞాన్‌ రోవర్‌ మేల్కొనకపోయినా పర్వాలేదు: ఇస్రో ఛైర్మన్‌
జాబిల్లిపై నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరిగి మేల్కోకపోయినా ఎలాంటి సమస్యా ఉండదని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ స్పష్టం చేశారు. చంద్రయాన్‌ 3 ప్రయోగంలో భాగంగా ప్రజ్ఞాన్‌ రోవర్‌ నుంచి తాము ఆశించిన పనిని రోవర్‌ ఇప్పటికే పూర్తి చేసిందని ఆయన పేర్కొన్నారు.
ఏదైనా గుప్పెట మూసి ఉన్నంత వరకే. గుప్పిట తెరిస్తే అసలు విషయం బయటకు తెలిసిపోతుంది. రాజకీయాల్లోనూ అంతే. కొన్ని అంశాల్లో స్పష్టత ఒక్కో సమయంలో వస్తుంది. 2024 ఎన్నికల సమయంలో అనేక విషయాలపై క్లారిటీ రానుంది.
దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కర్ణాటకలో వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నా ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. దక్షిణాదిన మరో కీలక రాష్ట్రమైన తమిళనాడులో అన్నాడీఎంకే కమలం కౌగిలి నుంచి బయటకు వచ్చేసింది.
ఆర్థికపరమైన విషయాలలో నెలనెల కొత్త కొత్త నిబంధనలు అమలు అవుతుంటాయి. అలాగే ఇప్పుడు అక్టోబర్‌ నెల ప్రారంభమైంది. డీమ్యాట్ ఖాతాదారులు నామినేషన్ ప్రకటించేందుకు గడువు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు నామినీని నమోదు చేసుకునేందుకు గడువు డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది సెబీ.
గూగుల్ మ్యాప్స్‌లోని సూచనలను అనుసరించి కారు నడిపిన కారణంగా ఇద్దరి ప్రాణాలు పోయాయి. కారుతో సహా నదిలో పడి ఇద్దరు యువ వైద్యులు కారు మరణించారు. వర్షాకాలంలో గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించే విషయమై జాగ్రత్తగా ఉండాలని కేరళ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

బండారు వ్యాఖ్యలపై మొదటిసారి స్పందించిన మంత్రి రోజా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం రేగింది. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు.

తొమ్మిదేళ్ల తర్వాత చెప్పులు ధరించిన రైతు

బాల్కొండ నియోజకవర్గంలోని పాలెం గ్రామానికి చెందిన పసుపు రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి తొమ్మిదేళ్ల తర్వాత కాళ్లకు చెప్పులు ధరించారు. అందుకు కారణం పసుపు బోర్డు వచ్చేవరకు చెప్పులు వేసుకోనని చేసిన ప్రతిజ్ఞ.


Tags:    

Similar News