టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-11-02 12:37 GMT


Ys Jagan : విశాఖకు జగన్

ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ నేడు విశాఖలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ ప్లీనరీలో పాల్గొనేందుకు విశాఖ బయలుదేరి వెళ్లారు. 74 దేశాలకు చెందిన రాయబారులు, మంత్రులు, ఇతర ప్రతినిధులు ఈ సదస్సుకు వస్తున్నారు. ఈరోజు నుంచి ఎనిమిదోతేదీ వరకూ ఈ ప్లీనరీ జరగనుంది.

ఏపీ సీఐడీ కీలక నిర్ణయం.. చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు

ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తుల అటాచ్ కు ప్రతిపాదనను సిద్ధం చేసింది. అటాచ్‌మెంట్ అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు.

మెగా పెళ్లి సందడి చూద్దాం రారండి..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డింపుల్ క్వీన్ లావణ్య త్రిపాఠి.. ఐదేళ్ల పాటు రహస్య ప్రేమాయణం నడిపి ఈ ఏడాది జులైలో ఎంగేజ్మెంట్ తో అందరికి తెలియజేశారు. నిశ్చితార్థం వేడుకతో మొదలైన ఈ పెళ్లి వేడుక.. పెళ్లి షాపింగ్, ప్రీ వెడ్డింగ్ పార్టీస్, సంగీత్ పార్టీ, హల్దీ, మెహందీ కార్యక్రమాల అంటూ సందడి సందడిగా సాగింది.

Aravind Kejrival : ఈడీ విచారణకు డుమ్మా

ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరు కావడం లేదు. ఈడీ తనకు ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కేజ్రీవాల్ లేఖ రాశారు. తనను నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా నిరోధించేందుకే నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.

Komatireddy : కోమటిరెడ్డి తోడల్లుడి ఇంటిపై ఐటీ రైడ్స్

కోకాపేట్ ఈడెన్ గార్డెన్స్ లో ఉన్న గిరిధర్ రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడు. గిరిధర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల వేళ ఐటీ దాడులు జరుగుతుండటం రాజకీయ పార్టీల్లో అందులో విపక్షాల్లో ఆందోళన కలిగిస్తుంది.

Sanath Nagar : మంత్రి తలసానికి ఆ... గండం... గట్టెక్కితే రికార్డు బ్రేక్

సనత్ నగర్ ఎన్నిక ఈసారి ఆసక్తికరంగా మారనుంది. ఇక్కడ మూడుసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యేలు లేరు. అయితే ఈసారి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈ రికార్డును బ్రేక్ చేయబోతున్నారా? లేదా? అన్నది తేలనుంది. ఇప్పటి వరకూ సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే అత్యధిక సార్లు విజయం సాధించాయి.

BJP : టీడీపీ మా భాగస్వామి కాదు

నవంబరు 7న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వస్తారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. ఆరోజు తెలంగాణలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ జరుగుతుందని, ఆ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ తమ భాగస్వామి కాదన్న లక్ష్యణ్, జనసేనతో మాత్రం పొత్తులో ఉన్నామని తెలిపారు.

BJP : 35 మందితో మూడో జాబితా

భారతీయ జనతా పార్టీ మూడో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మూడో విడత జాబితాలో మొత్తం 35 మంది అభ్యర్థులను పార్ీ అధినాయకత్వం ప్రకటించింది. ఇప్పటి వరకూ తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మూడు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తొలి విడతలో యాభై రెండు మంది పేర్లను విడుదల చేసింది.

ఎన్టీఆర్‌, చరణ్‌కి కొత్తగా వచ్చిన గౌరవం కాదు..

‘ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌’ సభ్యత్వాని.. గత నెలలో ఎన్టీఆర్, ఇప్పుడు రామ్ చరణ్ అందుకున్నాడు. ఇక ఈ విషయాన్ని వైరల్ చేస్తూ ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఇది ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు అందిన మరో గౌరవంగా చెప్పుకొస్తున్నారు.

Chandrababu : నేడు చంద్రబాబుకు వైద్య పరీక్షలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నేడు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. గుండె, అలర్జీ సమస్యలపై డాక్టర్ నాగేశ్వర్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆయనకు ప్రత్యేక వైద్యం అందించనుంది. అనంతరం ఆయన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లి అక్కడ శస్త్ర చికిత్స చేయించుకుంటారు.




Tags:    

Similar News