టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-09-20 12:37 GMT


వన్డేల్లో నంబర్ 1.. మన హైదరాబాదీనే

ఆసియా కప్ ఫైనల్ ను ఒంటి చేత్తో మలుపు తిప్పిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచ నంబర్ వన్ వన్డే బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.

శత్రువులను చంపేసే డ్రోన్‌.. దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకవుతారు

భారత వైమానిక దళం టెక్నాలజీలో మరింతగా ముందుకు సాగుతోంది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు కొంత టెక్నాలజీ వాడుతున్నారు. అయితే ఆగస్టులో ఉగ్రవాదులను అంతమొందించేందుకు భారత వైమానిక దళం హెరాన్ మార్క్-2 డ్రోన్‌ను అనంతనాగ్‌లో ప్రవేశపెట్టారు.

Breaking : విశాఖ పాలనకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. దసరా పండగను విశాఖలోనే జరుపుకోవాలని జగన్ అన్నారు. దసరా రోజు నుంచే విశాఖలో పరిపాలన సాగిస్తానని ఆయన మంత్రివర్గ సమావేశం అనంతరం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

తమ్ముళ్లూ... నాట్ హ్యపీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుపై ప్రకటించి వారం రోజులు దాటి పోతుంది. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు అంత సంతోషంగా లేనట్లు కనిపిస్తుంది. వారి నుంచి స్వాగతించే ప్రకటనలు ఎలాంటివి వెలువడటం లేదు.

మూకుమ్మడి రాజీనామా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను వచ్చే ఎన్నికల్లో క్యాష్ చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉంది. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది.

ఇదెక్కడి షాక్.. ఉప్పల్ కు నో ఎంట్రీ అట

భారత్ వేదికగా ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్‌ జరగనుంది. అయితే భారత్ ఆడే మ్యాచుల్లో ఒక్కటి కూడా హైదరాబాద్‌కు కేటాయించలేదు. ఇక ఉప్పల్‌ స్టేడియంలో సెప్టెంబర్ 29న పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్‌ జరగనుండగా..

సీఎం జగన్ కు అనారోగ్యం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు వైరల్ ఫీవర్ సోకడంతో బలహీనంగా ఉన్నారని మీడియా సంస్థలు తెలిపాయి. ఈరోజు ఆయన కేబినెట్ భేటీలో పాల్గొన్నారు.

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలకమైన బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. అవ్వడం ఎలా? పార్ట్-1

సోషల్ మీడియా.. ఇప్పుడు గొప్ప సాధనంగా మారిపోయింది. ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది సోషల్ మీడియా.. చాలా మందికి గొప్ప భవిష్యత్తును ఇచ్చింది సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛకు చాలా శక్తివంతమైన సాధనం.

హైదరాబాద్‌లో రూ.15 కోట్లతో మరో అద్భుత నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. అందులో రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌ నగరంలో అభివృద్ధిలో దూసుకుపోతోంది. మహా నగరం హైదరాబాద్‌ పర్యాటక రంగంలోనూ కూడా దూసుకుపోతోంది.



Tags:    

Similar News