టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-09-22 12:30 GMT

రిమాండ్ పొడిగింపు

చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 24వరకూ పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. మిమ్మల్ని కస్టడీకి అడుగుతున్నారని, మీ న్యాయవాదులు మాత్రం కస్టడీ అవసరం లేదని చెబుతున్నారని జడ్జి చంద్రబాబుకు తెలిపారు.

కలయిక ఎప్పటి వరకూ?

స్టేషన్‌ఘన్‌పూర్ లో బీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయాయి. ఇద్దరు ప్రధాన శత్రువులు ఏకమయ్యారు. ప్రగతి భవన్ లో ఇది జరిగింది. స్టేషన్ ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి కడియం శ్రీహరిలను ప్రగతి భవన్ కు పిలిపించిన కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను దిశానిర్దేశం చేశారు.

క్వాష్ పిటీషన్ కొట్టివేత

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ పై తీర్పు వెలువడింది. చంద్రబాబుకు ప్రతికూలంగా తీర్పు చెప్పింది. సీఐడీ తరుపున వాదనను సమర్థించింది.

ఈ చర్మ సంబంధిత వ్యాధి గుండె జబ్బులకు కారణం కావచ్చు!

ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులకు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు18 మిలియన్ల మంది మరణిస్తున్నారని పరిశోధన నివేదికలు చెబుతున్నాయి.

సొంత పార్టీ నేతలపైనే 'రాములమ్మ' సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎక్కువ ఇతర పార్టీలపై నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేవి ప్రతి రోజు చూస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో సొంత పార్టీల్లోనే కుంపటి ఏర్పడుతోంది.

మావోడికి చెప్తున్నా అంటూ పేర్ని నాని కౌంటర్లు

ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై పేర్ని నాని మాట్లాడారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగానే మావోడు ఒకడు తగుదునమ్మా అని వచ్చాడు.. ఆదరబాదరాగా స్పెషల్ ఫ్లైట్ ఒకటి పెడితే అక్కడి నుంచి వచ్చాడు. జైలు వద్దకు వచ్చి ఆయన అంటాడు.

99 రూపాయలకే సినిమాలు చూసేయొచ్చు

మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అక్టోబరు 13వ తేదీని జాతీయ సినిమా దినోత్సవంగా నిర్ణయించింది. సినిమా ఔత్సాహికుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో ప్రవేశానికి రూ.99 మాత్రమే వసూలు చేయనున్నట్లు జాతీయ మల్టీప్లెక్స్ ట్రేడ్ బాడీ తాజాగా పత్రికా ప్రకటనలో తెలిపింది.

అంబానీ కొత్త కారు.. వామ్మో!!

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ రిచ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంబానీ ఇటీవలే కొత్త Mercedes-Benz S680ని కొనుగోలు చేశారు. ఇది ఆయన వాహన శ్రేణి లోని 7వ బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ ఫ్లాగ్‌షిప్ సెడాన్.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

సెప్టెంబర్‌ 21న రాత్రి మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు 214 మంది సభ్యులు ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఈ మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది.
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. తన యాక్టింగ్ తో, స్క్రిప్ట్ సెలక్షన్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కాగా గత కొన్ని రోజులుగా నెట్టింట సాయి పల్లవికి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతూ ఉంది.



Tags:    

Similar News