టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-10-23 13:08 GMT


పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. తోపులాటలో కొడాలి నాని..

విజయవాడ దివంగత నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ వివాహం.. కృష్ణా జిల్లా పోరంకిలో ఆదివారం (అక్టోబర్ 22) రాత్రి ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు రాజకీయనాయకులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.

హోటల్ మంజీరాలో నారా లోకేశ్, పవన్ కళ్యాణ్

రాజమండ్రిలోటీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేశారు. ఐదు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ పొత్తు సమావేశం జరగనుండడం.. ఈ కీలక భేటీకి నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్రనేతలు హాజరవుతుండడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

బిషన్ సింగ్ బేడీ కన్నుమూత

భారత్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన బిషన్ సింగ్ బేడీ కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా 1966 నుంచి 1979 వరకు భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1946 సెప్టెంబర్ 25న జన్మించిన బిషన్ సింగ్ బేడీ 67 టెస్ట్ మ్యాచుల్లో 266 వికెట్లు తీసుకున్నారు. పది వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు.

నిజాముద్దీన్ దర్గాలో రేవంత్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిజాముద్దీన్ దర్గాని దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆయన నిజాముద్దీన్ దర్గాను దర్శించుకుని రానున్న ఎన్నికలలో విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయన వేడుకున్నట్లు చెబుతున్నారు.

వీడియో కాల్ ద్వారా క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఉపాసనతో కలిసి ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. తమ కూతురు 'క్లీంకార', ఫేవరెట్ పెట్ 'రైమ్‌'తో పాటు పలువురు కుటుంబసభ్యులతో మెగా జంట ప్రత్యేక విమానంలో ఇటలీ వెళ్లారు. ఇక అక్కడి విషయాలను ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు.
బ్యాంక్ లాకర్ చాలా సురక్షితంగా భావిస్తుంటాము. అయితే, తాజాగా ఓ ఉదంతం ఈ ఊహపై ప్రశ్నలను లేవనెత్తింది. విషయం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌. పై ఉదంతంలో ఓ మహిళ తన కూతురు పెళ్లి కోసం బ్యాంకు లాకర్ లో ఉంచిన రూ.18 లక్షలు చెదలు తిన్నాయి. అటువంటి నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత బ్యాంకులకు ఉందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది?

Big Breaking : ఘోర రైలు ప్రమాదం - 15 మంది మృతి

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఢాకాలో రెండు రైళ్లు ఢీకొని పదిహేను మంది మృతి చెందినట్లు సమాచారం. పదుల సంఖ్యలో గాయపడినట్లు తెలిసింది. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. ఢాకాకు ఎనభై కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

కోస్తాంధ్రలో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.

వీధి కుక్కల నుండి పారిపోడానికి ప్రయత్నించిన ప్రముఖ వ్యాపారి.. చివరికి

వీధి కుక్కల నుండి తప్పించునే ప్రయత్నంలో ఓ ప్రముఖ వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. వాఘ్ బక్రీ టీ గ్రూప్ యజమాని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌లో వీధికుక్కల నుండి తప్పించుకునే ప్రయత్నంలో పడిపోవడం వల్ల మెదడు రక్తస్రావం జరిగి మరణించారు.

బీఎండబ్ల్యూ కారు అద్దాలు పగులగొట్టి

కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలు ఓ దొంగతనం జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారు కిటికీని పగులగొట్టి అందులోని రూ.13 లక్షల నగదును అపహరించారు. ఈ ఘటనపై సర్జాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గత శుక్రవారం ఈ దొంగతనం జరగగా.. ఆ దొంగతనం మొత్తం నిఘా కెమెరాకు చిక్కింది.

Tags:    

Similar News