టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-09-24 12:33 GMT


కార్ల ర్యాలీకి అనుమతి లేదు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు, ఐటీ ఉద్యోగులు ఆదివారం నాడు కార్ల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఈ ర్యాలీని నిర్వహించనున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వీటిపై స్పందించిన విజయవాడ సీపీ కాంతిరాణ ఈ కార్ల ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదని స్పష్టం చేశారు.

ఆసియా క్రీడల ఫైనల్ లో భారత క్రికెట్ జట్టు

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టుకు పతకం ఖాయమైనట్టే. సెమీఫైనల్స్-1లో భారత జట్టు బంగ్లాదేశ్‌ జట్టును చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది.

టీటీడీ ధర్మరథం చోరీ.. ఎక్కడ దొరికిందంటే?

తిరుమలలో భక్తులను ఉచితంగా పలు ప్రాంతాలకు తరలించడానికి శ్రీవారి ధర్మరథం ఉపయోగిస్తూ ఉంటారు. భక్తులకు ఉచితంగా గమ్యస్థానాలకు తీసుకుని వెళ్లే ఈ బస్సు చోరీకి గురి అయింది. జీపీఎస్ ఉన్న బస్సు కావడంతో దాని లొకేషన్ ను ఎట్టకేలకు కనిపెట్టగలిగారు అధికారులు.

Mega157లో చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పిన దర్శకుడు..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవల 'భోళాశంకర్' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు ఈ మూవీతో అనేక విమర్శలు కూడా ఎదురుకున్నాడు. వయసుకి తగ్గ పాత్రలు చేయడం లేదని కామెంట్స్ వినిపించాయి.

పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా వివాహం నేడే.. అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..?

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళు చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన ఈ జంట.. మే నెలలో నిశ్చితార్థం చేసుకొని ఎంగేజ్మెంట్ రింగ్ లు మార్చుకున్న సంగతి తెలిసిందే.

లడ్డూలకు రక్షణ కరవు!

వినాయకుడి కోసం భారీ ఎత్తున లడ్డూలను తయారు చేయడం, వాటని వేలం పాటలో విక్రయించడం... ఇవన్నీ గత కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాయి. బాలానగర్‌ గణేష్‌ లడ్డూల విక్రయం ప్రతీ ఏడాది ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతోంది.

భారీగా జనం.. అటువైపు పోవద్దు..!

ఆదివారం సాయంత్య్రం ఖైరతాబాద్‌ వినాయకుడి దర్శనం కోసం రావద్దని గణేష్‌ మంటప నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. సెలవు రోజు కావడంతో భాగ్యనగర వాసులంతా ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకోడానికి క్యూ కడుతున్నారు.

జగన్ పాత్రలో జీవా ఫిక్స్.. 'యాత్ర 2' టెస్ట్ ఫోటోషూట్ వీడియో వైరల్..

టాలీవుడ్ డైరెక్టర్ మహీ వి రాఘవ్‌.. వైఎస్ జగన్ లైఫ్ స్టోరీతో 'యాత్ర 2' తెరకెక్కిస్తాను అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను కథగా తీసుకోని తెరకెక్కించిన సినిమా 'యాత్ర'. వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ హీరో 'మమ్ముట్టి' నటించగా.. 2019లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

అవయవదానం: ఏడుగురి ప్రాణాలు కాపాడిన సంగారెడ్డి యువకుడు

సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ కు చెందిన యువకుడు చనిపోతూ తన అవయవాలు దానం చేసి ఏడుగురి ప్రాణాలు నిలబెట్టాడు. సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ కి చెందిన యువకుడు, భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేత గొల్ల పెంటన్న ఇటీవల రోడ్డు ప్రమాదం తీవ్రంగా గాయపడ్డాడు.

ఓటీటీలోకి వచ్చేస్తున్న ఖుషి మూవీ.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

లైగర్ భారీ ఫ్లాప్ అనంతరం విజయ్ దేవరకొండ నుండి వచ్చిన సినిమా ఖుషి . విజయ్ దేవరకొండ రొమాంటిక్ జోనర్‌ సినిమా.. అది కూడా సమంతతో కలిసి చేస్తూ ఉండడంతో.. భారీ విజయాన్ని అందుకుంటుందని భావించారు.


Tags:    

Similar News