టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-10-25 12:56 GMT


Pawan Kalyan : అమిత్ షా అదే అడిగితే.. దానికి షరతు ఇదేనట

ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పెద్దలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. తెలంగాణాలో పొత్తు అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే ప్రత్యేక విమానంలో పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తో కలసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

Vivek : నేను పార్టీ మారడం లేదు బాబోయ్

తాను పార్టీ మారడం లేదని మాజీ పార్లమెంటు సభ్యుడు గడ్డం వివేక్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై గత కొంత కాలంగా పార్టీ మారతారని ప్రచారం జరుగుతుందని అన్నారు. కానీ అది ఒట్టి ప్రచారం మాత్రమేనని, తాను భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని గడ్డం వివేక్ తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడటంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎవరి ఊహలు వారివి.. ఎవరి ఆలోచన వాళ్లది అంటూ కామెంట్స చేశారు. తెలంగాణ ప్రజలు అంతా చూస్తున్నారన్నారు. ఆయన ఆలోచన ఆ విధంగా ఉందని, కానీ తెలంగాణ ప్రజలు ఇదంతా చూస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.
సోషల్ మీడియా అనేది ఎంటర్టైన్మెంట్, సమాచారం, కొత్త అప్డేట్స్ తెలుసుకోవడానికి కంటే ఫ్యాన్ వార్స్ కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ ఫ్యాన్ వార్స్ అనేవి కూడా సినిమా, క్రీడా, పొలిటికల్ రంగం అని తేడా లేకుండా నిత్యం జరుగుతూనే ఉంటున్నాయి.

పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ను ఎప్పుడు సమర్పించాలి?

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లను కలిగి ఉంది. వారు సంవత్సరానికి ఒకసారి తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. అంటే లైఫ్‌ సర్టిఫికేట్‌. 15,000 వరకు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎస్‌ (ఉద్యోగుల పెన్షన్ పథకం) ప్రయోజనం లభిస్తుంది

Sridhar Vembu : 18 వేల కోట్ల ఆస్తి ... అలా వదిలేసి ఇలా

కోటి రూపాయలుంటే ఇంకో కోటి రూపాయలు సంపాదించాలని ఆశ. రెండు కోట్లు వస్తే ఇరవై కోట్లు రాలేదేనన్న బాధ. ఇరవై కోట్లు వచ్చాక ఇక అసలు కథ మొదలవుతుంది. వంద కోట్లు ఎలా సంపాదించాలి? ఇదీ మానవ బలహీనత. ఎవరైనా సరే. ఎంతటి వారైనా సరే కాసులకు దాసోహం అనక తప్పదు.
సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకొని భారీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళంలోనే కాకుండా తెలుగు, ఇతర భాషల్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్టుగా నిలిచింది.

కార్తీ సినిమాకి చిరు అడ్డుపడుతున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ హిట్టుని, 'భోళాశంకర్'తో డిజాస్టర్ ని అందుకున్నాడు. భోళాశంకర్ విషయంలో అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. దీంతో చిరు తన రూట్ ని మార్చేశాడు. ప్రయోగాలు వైపు, తన ఏజ్ కి తగ్గ కథలు వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ పథకంలో బ్యాంకుల పనితీరుపై మోడీ ప్రశంసలు

మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం రకరకాల పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. రైతుల నుంచి సామాన్య ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో 'పీఎం స్వానిధి యోజన' ఒకటి.

World cup 2023 : బ్రేకుల్లేని బుల్లెట్ ట్రెయిన్ .. ఆరో మ్యాచ్...ఏమవుతుందో

భారత్ కు దాదాపు వారం రోజులు విరామం వచ్చింది. ఈ నెల 22వ తేదీన న్యూజిలాండ్‌తో మ్యాచ్ భారత్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తిరిగి 29వ తేదీన ఇంగ్లండ్‌తో తలపడనుంది. వారం రోజుల పాటు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఆటగాళ్లు తొలి రోజు విశ్రాంతి తీసుకున్నా తర్వాత నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు.


అసంతృప్తితో బండి సంజయ్‌.. కారణం ఏంటంటే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది. కానీ విడుదలైన మరుసటి రోజు నుంచే అసంతృప్తులు మొదలయ్యాయి. అలకలు, కన్నీళ్లు, ఇలా ఒక్కటేమిటి కోపతాపాలు వంటివి కనిపిస్తున్నాయి. ఎవరో కాదు.. బండి సంజయ్ కూడా ఈ జాబితాపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News