టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-09-25 12:44 GMT


సాగర నగరం సై.. సై..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టీల్ సిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో కాబోయే పరిపాలన రాజధానిగా విశాఖను మారుస్తామని జగన్ సర్కారు నమ్మకంగా ఉంది. తన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్న జగన్ మూడు రాజధానుల వైపు కూడా వడివడిగా అడుగులు వేస్తున్నారు.

జవాబు దొరకని ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలైన తెలుగుదేం, జనసేనల మధ్య పొత్తు కుదిరి దాదాపు పది రోజులకు పైగానే పూర్తయింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్ కల్యాణ్ తాను బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయని ప్రకటించారు.

“హ్యాండ్” రైజింగ్ కోసం

త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీకి అత్యవసరం. రానున్న లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలన్నా, భవిష్యత్ లో పెద్దల సభలో పట్టు నిలుపుకోవాలనుకున్నా ఐదింటిలో గెలిచి తారాల్సిన పరిస్థితి.
రాజకీయాలకు వయసుతో సంబంధం లేదు. ఎన్ని పార్టీలు మారామన్నది జనం చూడరు. ఆ నేత వల్ల ఉపయోగం ఉంటుందా? లేదా? అనేదే చూసి పార్టీలు టిక్కెట్లు కేటాయిస్తాయి. ఆర్థికంగా బలవంతుడయితే చాలు అరవై శాతం ప్లస్ పాయింట్లు పడినట్లే.

బంగారు పతకం సాధించిన విమెన్స్ క్రికెట్ టీమ్

ఆసియా గేమ్స్ లో భారత మహిళల జట్టు బంగారు పతాకాన్ని కైవసం చేసుకుంది. లో స్కోరింగ్ మ్యాచ్ లో భారత జట్టు శ్రీలంక ను ఓడించి బంగారు పతాకాన్ని సొంతం చేసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్.. లేటెస్ట్ రచ్చ ఏమిటంటే?

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు.

అప్పటి నుండే వారాహి నాలుగో విడత యాత్ర

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయయాత్ర అక్టోబర్ 1 తేదీ నుంచి ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటన విడుదల చేశారు. పవన్ తదుపరి విడత వారాహి విజయయాత్ర షెడ్యూల్ ఖరారైందని

2 శాతం వాటా అమ్మినా 400 కోట్లు వస్తాయి: నారా భువనేశ్వరి

ప్రజల సొమ్ములను తీసుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని.. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తారని నారా భువనేశ్వరి అన్నారు

రేపటికి వాయిదా.. ఎందుకంటే?

టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్ లపై మంగళవారం విచారిస్తామని తెలిపింది.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ టెన్షన్ పెట్టిన సంగతి తెలిసిందే..! ఊహించని విధంగా నిఫా వైరస్ వ్యాప్తి చెందడం.. మరణించిన వారిలో నిఫా వైరస్ ఉందని తేలడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. దీంతో అధికారులు హుటాహుటిన పలు ఆంక్షలను అమలు చేశారు.

Tags:    

Similar News