టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-09-27 12:43 GMT


Breaking : గ్రూప్ వన్ పరీక్ష రద్దు

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. గ్రూప్ వన్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. అభ్యర్థుల నుంచి ఈసారి ఖచ్చితంగా బయోమెట్రిక్ తీసుకోవాలని కోరింది. పరీక్ష రద్దు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించింది.

సుప్రీం కోర్టులో చంద్రబాబుకు షాక్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు బ్రేక్ పడింది. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

రామ్ గోపాల్ వర్మ కళ్ళు ఈ అమ్మాయిపై పడ్డాయి

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని సెలెబ్రిటీ చేస్తారో ఎవరికీ తెలియదు. గతంలో సోషల్ మీడియాలో కొందరి గురించి ప్రస్తావించిన రామ్ గోపాల్ వర్మ వారిని సెలెబ్రిటీలను చేసేశారు. కొందరికి సినిమాలలో అవకాశాలు దక్కగా.. ఇంకొందరు బుల్లితెరపై, ఓటీటీ షోలలో రాణిస్తూ ఉన్నారు. తాజాగా మరోసారి వర్మ ఓ అమ్మాయి గురించి ప్రస్తావించారు.

చంద్రబాబు ప్రజల సొమ్మేమీ దోచుకోలేదు: నారా భువనేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు దీక్షలు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో చేపట్టిన నిరసన దీక్షలో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పాల్గొన్నారు.

ఏసీబీ కోర్టులో కూడా చంద్రబాబుకు షాక్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ లపై విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.

ఇండియా నుంచి ఆస్కార్‌కు '2018' మూవీ ఎంపిక..

గత ఏడాది భారత చిత్రాలు ఆస్కార్ (Oscar) పురస్కారంలో సత్తా చాటాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో RRR 'నాటు నాటు' సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో 'ది ఎలిఫెంట్ విష్పరర్స్' మూవీ ఆస్కార్ ని అందుకొని చరిత్ర సృష్టించాయి.

ప్రభాస్ రాకతో వెనక్కి వెళ్లే ఆలోచనలో వెంకటేష్, నాని..

టాలీవుడ్ లో ప్రభాస్ (Prabhas) సినిమా రిలీజ్‌లు ఇతర మేకర్స్ కి పెద్ద సమస్య అయ్యిపోయింది. ఆ చిత్రాలు అనౌన్స్ చేసిన డేట్ కి రాకుండా, మరో తేదీకి షిఫ్ట్ అవుతుండడంతో.. ఆ సమయంలో రావాల్సిన కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది.

ఏపీలో భారీగా గంజాయి పట్టివేత

తెలుగు రాష్ట్రాల్లో గంజాయా ఏరులైపారుతోంది. గుట్టుప్పుడు కాకుండా నిర్వహిస్తున్నగంజాయి దందాను పోలీసులు గుట్టురట్టు చేస్తున్నారు. తాజాగా విశాఖ అల్లూరి ఏజెన్సీలో రూ.3 కోట్ల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

ఖాతాదారులకు అలర్ట్‌.. అక్టోబర్ నెలలో సగం రోజులు బ్యాంక్ సెలవులు..

సెప్టెంబర్‌ నెల మూగియబోతోంది. అక్టోబర్‌ వస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రతినెల బ్యాంకులకు సంబంధించిన హాలిడేస్‌ లిస్ట్‌ను విడుదల చేస్తుంటుంది. అలాగే వచ్చే నెల అంటే ఆక్టోబర్‌లో కూడా బ్యాంకులకు సెలవులు భారీగానే ఉండనున్నాయి. అయితే వినియోగదారులు ముందస్తుగా బ్యాంకుల సెలవులను గమనించి ప్లాన్‌ చేసుకోవడం చాలా ముఖ్యం.
కాసేపట్లో భారత్ - ఆస్ట్రేలియా మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ఫీల్డింగ్ కు దిగనుంది. ఈరోజు రాజ్‌కోట్ లో జరగనున్న చివరి మ్యాచ్ లో గెలుపు కోసం రెండు జట్లు పోటీ పడుతున్నాయి.

వారికి నో టిక్కెట్

వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ పార్టీలో కాక రేపుతున్నాయి. ఎంత మందికి టిక్కెట్ రాదు? ఎంతమందికి వస్తాయి? టిక్కెట్ ఇవ్వడానికి ప్రాతిపదిక ఏంటి? కేవలం సర్వేలేనా? సామాజిక కోణంలోనూ టిక్కెట్ల కేటాయింపు ఉంటుందా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కలవరం రేపుతున్నాయి.



Tags:    

Similar News