టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-09-28 12:42 GMT


గెలిస్తే అదేనా?

నిజానికి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాల్సిన వాళ్లంతా ఈసారి అసెంబ్లీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో శాసనసభ టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవి కోసమో.. వీలయితే ముఖ్యమంత్రి అవ్వాలన్న ఉద్దేశ్యంతో అందరూ అసెంబ్లీ వైపే చూస్తున్నారు.

1994 నుంచి 2023 వరకు బాలాపూర్ లడ్డు వేలం వివరాలు..

భాగ్యనగర గణేష్‌ ఉత్సవాలు అంటే గుర్తుకు వచ్చేది బాలాపూర్‌ లడ్డూ.. ఏటా ఈ లడ్డూను దక్కించుకునేందుకు ఎంతోమంది సంపన్నులు పోటీపడుతుంటారు. వందలూ కాదు.. వేలూ కాదు.. లక్షల ధర పలుకుతుంది బాలాపూర్‌ లడ్డూ.. పాత రికార్డులను తిరగరాస్తూ.. 2022లో జరిగిన వేలంలో ఏకంగా మర్రిశశాంక్​రెడ్డి రూ. 24 లక్షల60 వేలకు లడ్డును దక్కించుకున్నారు.

ఇన్నర్‌ రింగ్ రోడ్డు స్కామ్ ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇప్పుడు ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్ ఒక కుదుపు కుదుపేస్తుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు మరో కుంభకోణం మెడకు చుట్టుకునేలా ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పెద్దయెత్తున స్కామ్ జరిగిందని సీఐడీ ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది.

Disease X: కోవిడ్ -19 కంటే 'డిసీజ్ ఎక్స్' 20 రెట్లు ప్రాణాంతకం కావచ్చు!

కరోనా మహమ్మారి దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈలోగా శాస్త్రవేత్తలు కొత్త మహమ్మారి గురించి హెచ్చరిక జారీ చేశారు. రాబోయే కొన్నేళ్లలో స్పానిష్ ఫ్లూఅంత ప్రమాదకరమైన అంటువ్యాధి వచ్చే అవకాశం ఉందని UK శాస్త్రవేత్తలు తెలిపారు.

నాడి పట్టిన నేతలు

నేతలు జనం పల్స్ పడతారు. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటారు. అధికారంలో ఉన్న వారితో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఎప్పటికప్పుడు తాము సొంతంగా సర్వేలు చేయించుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువయిపోయింది. ఆ సర్వేల ఫలితాల్లో ఖచ్చితత్వం ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే వాటి ఆధారంగానే నేతల నిర్ణయాలుంటాయి.

వెళ్లి.. మళ్లీ రావయ్యా....!

ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం నిమజ్జనం పూర్తయింది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వేలాది మంది ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. సందడిగా నృత్యాలు చేస్తూ గణనాధునికి వీడ్కోలు పలికారు. 63 అడుగుల ఖైరతాబాద్ వినాయకుడు పదకొండు రోజులు భక్తుల పూజలు అందుకున్నాడు.

ఎంఎస్ స్వామినాధన్ మృతి

వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్ మృతి చెందారు. కొద్దిసేపటి క్రితం ఆయన చెన్నైలో కన్నుమూశారు. స్వామినాధన్ వయసు 98 సంవత్సరాలు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు చెన్నైలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నైలోని ఆయన నివాసంలోనే మృతి చెందినట్లు చెప్పారు.

రికార్డుస్థాయి ధరకు బాలాపూర్ లడ్డూ

బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. గత ఏడాది కంటే అత్యధిక ధర పలికింది. ఈసారి బాలాపూర్ లడ్డూ ఇరవై ఏడు లక్షల రూపాయలు ధర పలికింది. దయానంద్ రెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. వేలంలో దాసరి దయానంద్ రెడ్డి దక్కించుకుని తన సొంతం చేసుకున్నారు.
‘అర్జున్ రెడ్డి’ సినిమాని బాలీవుడ్ లో 'కబీర్ సింగ్'గా తెరకెక్కించి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ ని అందుకున్న టాలీవుడ్ దర్శకుడు 'సందీప్ రెడ్డి వంగ'. ఇక తన తదుపరి సినిమాని కూడా అక్కడే ప్లాన్ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తో 'యానిమల్' (Animal) అనే సినిమాని తెరకెక్కించాడు.

యువగళం పునఃప్రారంభం వాయిదా

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 29వ తేదీ నుంచి ఆయన యాత్రను ప్రారంభించాలని భావించారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నుంచి యువగళం పాదయాత్రను పునఃప్రారంభించాలని లోకేష్ నిర్ణయించారు.



Tags:    

Similar News