బాబుతో ములాఖత్ అయిన భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణితో పాటు మాజీ మంత్రి నారాయణ కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. వారానికి రెండుసార్లు ములాఖత్ సౌకర్యం ఉండటంతో కొద్దిసేపటి క్రితం వీరంతా చంద్రాబాబుతో ములాఖత్ అయ్యారు.
సలార్ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసేంది
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చేస్తున్న మూవీ 'సలార్' (Salaar). హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు పార్ట్ లుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ మేకర్స్ గతంలో ప్రకటించారు.ఉన్నవే 119 నియోజకవర్గాలు..
యాభైకి పైగా బీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ కూడా ఇంచుమించు యాభై దక్కించుకుంటుంది. ఏడు ఎమ్ఐఎమ్ ని ఒదిలిపెట్టవు. మిగతా పది పన్నెండు స్థానాల్లో బిజేపి ఏడు ఎనిమిది గెలిస్తే ఓ ఐదు వేవ్‌లో ఏదో ఓ పార్టీకి మొగ్గుతాయి...మనది మనసున్న ప్రభుత్వమని జగన్ అన్నారు. మనసులేని వారు కొందరితో యుద్ధం జరగబోతుందన్నారు. నిరుపేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరగబోతుందన్నారు. విజయవాడలోని విద్యాధరపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రత్యర్థులు అనేక రకాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ అన్నారు.
వన్డే వరల్డ్ కప్ కు అంతా సిద్ధమయింది. మరో వారం రోజుల్లో ప్రపంచ సమరం మొదలు కాబోతుంది. క్రికెట్ ఫ్యాన్స్ కు దాదాపు నెలన్నర రోజులు పండగే పండగ. పసందైన షాట్లు.. అదిరిపోయే సిక్స్ లు, బౌండరీ లైన్ దాటే బంతులు, అద్భుతమైన క్యాచ్ లు, క్లీన్ బౌల్డ్, డకౌట్ లు, సెంచరీలు ఇలా ఒకటేమిటి చూసినోళ్లకు చూసినంత.
లంచం ఇచ్చానంటూ సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వెబ్ సైట్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. విశాల్ చేసిన ఆరోపణలపై విచారణ జరపనున్నట్లు తెలిపింది.
విశాఖలో ఇంటర్నేషనల్ బెట్టింగ్ ముఠా.. రూ.400 కోట్లా!!
విశాఖలో అంతర్జాతీయ బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారి నుండి సమాచారం సేకరించిన పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ అరెస్టులపై డీసీపీ కంచి శ్రీనివాసరావు స్పందించారు. ఈ ముఠాలో వాసుదేవరావు, దినేశ్ అలియాస్ మోను ప్రధాన నిందితులని..నారా లోకేశ్ కు ముందస్తు బెయిల్
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అక్టోబర్ 4వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది.అమెరికాలో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లిన విద్యార్థి అక్కడే ప్రాణాలు వదిలాడు. మల్కాజిగిరిలోని మారుతీనగర్ రోడ్డు నంబరు 8కు చెందిన రైల్వే ఉద్యోగి అశోక్ చిన్న కుమారుడు బాలరేవంత్ ఎంఎస్ చేయడానికి అమెరికాలోని చికాగోకు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి రూమ్ లో ఉంటున్నాడు.
మోత మొగిద్దాం అంటున్న టీడీపీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు గారికి మద్దతుగా సెప్టెంబర్ 30, 2023 రాత్రి 7గంటల నుండి 7గంటల 5నిమిషాల వరకు ఐదు నిమిషాల పాటు