టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
కేసీఆర్ ఫాం హౌస్ కు...ఈ విజయం అమరవీరులకు అంకితం, జూబ్లీహిల్స్ లో నిలిచిపోయిన కౌంటింగ్
(నోట్: పూర్తి వివరాల కొరకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
డిసిషన్ ఛేంజ్ చేసుకుంది అందుకేనా... ఆ ప్రమాదం ఉందనేనా?
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 64 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తరువాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కు పంపారు. ఆమె కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు.కారంటే బోరు కొట్టిందా...? ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచిందా?
కేసీఆర్ పెద్ద స్ట్రాటజిస్టు.. వ్యూహాలు రచించడంలో ఆయనను మించిన వారు లేరు. ఇవన్నీ ఎన్నికలకు ముందు వరకూ ఉన్న మాటలు. పోలింగ్ తేదీనైనా గ్రౌండ్ ను తనకు అనుకూలంగా మార్చుకోగలరన్న సత్తా ఉందన్నది గులాబీ పార్టీకి చెందిన కార్యకర్తల ధైర్యం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ కు ఎన్నికలు పెద్ద కష్టం కాదని వాళ్లు భావిస్తూ వచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు ఇక్కడ నాయకత్వం లేమి కూడా తమకు కలసి వచ్చే అంశంగా కేసీఆర్ సయితం భావిస్తూ వచ్చారు.కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత ఎదురు చూసి ఎదురు చూసిన నేతలకు ఇప్పుడు హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. అది అలా ఉంచితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దానిపై చర్చ ఒకవైపు జరుగుతుంటే...ఇంతకీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న దానిపై టాపిక్ మళ్లింది. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.
కామారెడ్డి నియోజకవర్గంలో అనూహ్య మైన ఫలితం వచ్చింది. అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ ను కాదని ప్రజలు బీజేపీని గెలిపించారు. బీజేపీ నుంచి కె.వెంకట రమణారెడ్డి గెలుపొందారు. అసలు ఎవరూ ఊహించని విజయం. అక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఇంతకీ ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓడించిందెవరు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ కు అనుకూలంగా చాలా నియోజకవర్గాల్లో పనిచేశాయి. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. గాంధీ భవన్ లో టీడీపీ శ్రేణులు పసుపు జెండాలు పట్టుకొని డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ యాక్షన్ కు దిగింది. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన ఎన్నికల కోడ్ అమలులో ఉండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడాన్ని తప్పు పట్టింది. ఆయన స్థానంలో అర్హత ఉన్న అధికారిని డీజీపీగా నియమించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
ఇద్దరు చంద్రుల కథ!
కేసీయార్, చంద్రబాబు ఇద్దరూ సమ ఉజ్జీలు. నలభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న నేతలు. 2000 సంవత్సరం వరకూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నారా చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు. ఎన్టీయార్ వెన్నుపోటు ఎపిసోడ్ ముగిసిన తర్వాత కేసీయార్ చంద్రబాబుకు అన్ని రకాలుగా మద్దతిచ్చారు. 1999 ఎన్నికల తర్వాత.. తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత..జూబ్లీహిల్స్ లో కౌంటింగ్ నిలిచిపోయింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి 11 రౌండ్ల వరకూ మాత్రమే కౌంటింగ్ జరిగింది. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరోసారి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ పోటీ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ కు చేరుకోలేదు. ఆయన ఫాం హౌస్ కు వెళ్లిపోయారు. అయితే సాధారణ పౌరుడిగా ఆయన రాజ్‌భవన్ కు బయలుదేరి వెళ్లారని అందరూ భావించినా ఆయన రెండు ప్రయివేటు వాహనాలతోకలసి ఫాం హౌస్ కు వెళ్లారు. కాన్వాయ్ ను కూడా వదిలేసి ఆయన ట్రాఫిక్ కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సామాన్యుల తరహాలో ఫాం హౌస్ కు వెళ్లిపోయారు.
డిసెంబరు 3 ఒక ప్రత్యేక రోజు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే రోజు శ్రీకాంతాచారి అమరుడయ్యారన్నారు. అదే రోజు ప్రజలు విలక్షణమైన తీర్పు ప్రజలు ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్ నేతలకు ఇచ్చినందుకు నమస్కారాలు తెలుపుతున్నానని చెప్పారు. తాను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలసి పార్టీని ముందుకు నడిపించడంలో అందరు నేతలు తమకు సహకరించారన్నారు.