అక్టోబర్ నెలాఖరుకు వచ్చినా ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపలేదు. కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో.. ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నా ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం ఉంది. అయితే ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుపాను ప్రభావమే కారణమని చెబుతున్నారు విశ్లేషకులు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ వేల సంఖ్యలో అభిమానులు గచ్చిబౌలి స్టేడియానికి తరలి వచ్చారు. ఐటీ ఉద్యోగులు కుటంబ సమేతంగా రావడంతో గచ్చిబౌలి స్టేడియం పూర్తిగా నిండిపోయింది. సీబీఎన్ వెంటే తాము అంటూ నినాదాలతో స్టేడియం హోరెత్తింది.
బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ కత్తి దాడిలో ప్రభాకర్ రెడ్డి కడుపులో తీవ్ర గాయమయింది. వెంటనే ఆయన అనుచరులు ఆగంతకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించినట్లు సమాచారం అందుతుంది. మెదక్ జిల్లాలోని సూరంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి ఇంటి మీద ఆందోళన కారులు దాడి చేశారు. ఆయన ఇంటికి నిప్పుపెట్టారు. సోలంకి అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత. మరాఠా రిజర్వేషన్ల పోరాటం ఉధృతం అయింది. ఎమ్మెల్యే ఇంటి బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు రాళ్లు రువ్వారు.
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. తమ నివేదికలను బయటపెడుతున్నాయి. ఒక్కో సర్వే ఒక్కోరకంగా రావడంతో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. అధికార బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని కొన్ని సర్వే సంస్థలు చెబుతుండగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మరి కొన్ని సంస్థలు చేపట్టిన సర్వేలు చెబుతున్నాయి.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'దేవర'. ఈ సినిమాని కూడా రెండు పార్టులుగా తీసుకు వస్తున్నామంటూ ప్రకటించి సినిమా పై అంచనాలు మరింత పెంచేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
పాలు పొంగితే ఏమవుతుంది.. అంతా నేలపాలవుతుంది. అలాగే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది. రాజకీయ పార్టీలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రధానంగా అధికార పార్టీకి చేరికలు ఉత్సాహాన్ని తెచ్చే కన్నా.... క్యాడర్ లో మళ్లీ గ్రూపులకు దారి తీసే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి ఎదుర్కొనలేదు.
తాను వైసీపీలో చేరడం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మ్మీనారాయణ తెలిపారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను ఒక కార్యక్రమంలో నాడు - నేడు, ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని అభినందించిన మాట వాస్తవమేనని, అంత మాత్రాన తాను వైసీపీలో చేరుతున్నానని ప్రచారం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన ఎంపికపై కొంత ఇష్టం కొంత అయిష్టంగానే కనపడుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను బట్టి అభ్యర్థిని ఎంపిక చేసినట్లు కనపడుతుంది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఎంపిక మామూలుగా జరగలేదు.
ఓడిపోతారనుకున్న మ్యాచ్ లో విజయం సాధించాం. అది మన గొప్ప తనమా? ప్రత్యర్థుల బలహీనతా? అంటే చెప్పలేం కానీ మొత్తం మీద టీం ఇండియాకు ఈ వరల్డ్ కప్ లో సుడి ఉందని మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. భారత్ కు ఈ వరల్డ్ కప్ లో వరసగా ఆరో విజయం.