టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-10-31 12:39 GMT


Breaking : చంద్రబాబు కు బెయిల్

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇస్తూ తీర్పు చెప్పడంతో ఈరోజు సాయంత్రానికి బయటకు వచ్చే అవకాశముంది. కోర్టు ఆర్డర్స్ బయటకు వచ్చిన వెంటనే జైలు అధికారులకు చంద్రబాబు తరుపున న్యాయవాదులు సమర్పించాల్సి ఉంటుంది.

Rahul Gandhi : బీజేపీపై సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల నేతల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడూ హ్యాకింగ్ కు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశఆరు.

Devansh : 52 రోజుల తర్వాత తాతను చూసిన దేవాన్ష్ ఏం చేశాడంటే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి మనవడు దేవాన్ష్ ను చూసి హత్తుకున్నారు. మనవడిని చూసిన ఆయన మనసు ఉత్సాహంతో ఉరకలేసింది. గత యాభై రెండు రోజుల నుంచి చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ధనుష్ హీరోగా ఇళయరాజా బయోపిక్‌..!

మాస్ట్రో ఇళయరాజా దశబ్దాల కాలం నుంచి తన సంగీతంతో ప్రతి ఒక్కర్ని మంత్రముగ్దులను చేస్తూ వస్తున్నారు. 50 ఏళ్ళ సంగీత కెరీర్ లో 1000 పైగా చిత్రాలకు 7000కు పైగా పాటలు, 20,000 పైగా మ్యూజికల్ కాన్సర్ట్ షోలు చేసి సంగీత సాగరాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పటికి కూడా ఇళయరాజా.. సినిమాకి తన సంగీత సేవని అందిస్తూనే వస్తున్నారు.

రూ. 400 కోట్లు ఇవ్వండి.. లేకపోతే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. 400 కోట్ల డ‌బ్బు డిమాండ్ చేస్తూ ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈ మేరకు మంగళవారం పోలీసులు సమాచారం అందించారు.

వరుణ్ లావణ్య పెళ్లి సందడి.. చరణ్, బన్నీతో పాటు నితిన్..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రేపు నవంబర్ 1న మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30 నుంచి మొదలైన ఈ పెళ్లి సంబరం డుక.. సంగీత్ పార్టీ, హల్దీ, మెహందీ కార్యక్రమాలతో సందడిగా సాగనుంది.

Breaking : ఏపీలో మరో ఈడీ కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో ట్రాఫిక్ చలాన్ల కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయడానికి ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు.

లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నానంటూ ప్రకటించిన హీరోయిన్..

తెలుగు అమ్మాయి శ్రీ దివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. రవిబాబు తెరకెక్కించిన 'మనసారా' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తరువాత టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించనప్పటికీ.. ఇక్కడ మేకర్స్ ఆమెను పట్టించుకోలేదు.

Purandhreswari : బెయిల్ రావడం మంచిదే.. స్వాగతిస్తున్నాం

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ బీజేపీ స్వాగతించింది. పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి మాట్లాడుతూ తాము మొదటి నుంచి ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పు పడుతున్నామని చెప్పారు. తమ పార్టీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు.

Ambati Rambabu : బెయిల్ పై ఏమిటీ టీడీపీ హంగామా?

న్యాయం గెలిచిందని టీడీపీ హంగామా చేయడాన్ని మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. అనారోగ్య కారణాలతోనే ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చిందన్న విషయాన్ని మరచిపోతున్నారన్నారు. కేవలం ఆసుపత్రికి వెళ్లి కంటికి చికిత్స చేయించుకుని తిరిగి నవంబరు 28వ తేదీన జైలుకు సరెండర్ కావాలని ఆదేశించిన సంగతిని విస్మరిస్తున్నారన్నారు.


Data Leak : 81 కోట్ల మంది డేటా లీక్.. సైబర్ దొంగల చేతుల్లో

సైబర్ క్రైమ్ లు ఎక్కువయ్యాయి. సులువుగా సంపాదించడం కోసం అనేక మంది ముఠాలుగా ఏర్పడి ప్రపంచ వ్యాప్తంగా సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నాయి. వీరిని పట్టుకోవడమూ కష్టమే. బ్యాంకులో ఉన్న నగదు మనకు తెలియకుండానే మాయమయిపోతుంది. ఈజీ మనీ సంపాదనకు అలవాటుపడిన ముఠాలు సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నాయి.



Tags:    

Similar News