టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-10-04 12:28 GMT

నారా లోకేశ్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు స్వల్ప ఊరటను ఇచ్చింది. ఈ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ ను ఈ నెల 12 వరకు కోర్టు పొడిగించింది. లోకేశ్ కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఈరోజుతో ముగియనుంది.


'నా కొత్త ఫ్రెండ్' అంటున్న రామ్‌చరణ్.. ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉంటూ పరిశ్రమలో ఒక ఫ్రెండ్లీ నేచర్ ని తీసుకు వస్తున్నాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్రెండ్ లిస్టులోకి మరో కొత్త ఫ్రెండ్ వచ్చాడంట.


ప్రపంచ కప్ షెడ్యూల్.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి

ఆసియా కప్ ను గెలిచిన భారత జట్టు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలని ఎదురుచూస్తూ ఉంది. అక్టోబర్- నవంబర్‌లలో సాగే మెగా ఈవెంట్ లో భారత్ సత్తా చాటాలని అనుకుంటూ ఉంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14కి రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే.


మాయమాటలు నమ్మొద్దు : హరీశ్‌రావు

మాయమాటలే చెప్పేవారిని నమ్మొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మూడు గంటలు విద్యుత్తు వస్తుందని, బీఆర్ఎస్‌కు ఓటేస్తే 24 గంటలు విద్యుత్తు వస్తుందన్నారు. కొడంగల్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. మోసపోతే గోస పడతామన్నారు. కాంగ్రెస్ చెప్పిన గ్యారంటీ పథకం వలలో పడవద్దని హరీశ్‌రావు అన్నారు.


Breaking : పవన్ కు పోలీసు నోటీసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏ ఆధారంతో ఆరోపణలు చేశారో వివరణ ఇవ్వాలంటూ పవన్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడన సభలో రాళ్లతో దాడి చేస్తారని, ఇందుకోసం రౌడీషీటర్లను కూడా అధికార వైసీపీ ఇప్పటికే దించిందని పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.


తెలుగులో ఇక సినిమాలు రిలీజ్ చేయను.. జర్నలిస్టుకి సిద్దార్థ్ వార్నింగ్..

తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో సిద్దార్థ్ (Siddharth) ప్రస్తుతం తమిళంలోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అక్కడ చేసిన చిత్రాలను డబ్ చేసి ఇక్కడ అభిమానుల కోసం తీసుకు వస్తున్నాడు. ఈక్రమంలోనే తన నటించిన రీసెంట్ హిట్ మూవీ ‘చిత్తా’ని తెలుగులో 'చిన్నా' అనే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు.


సైనికులను వెంటాడుతున్న ఆత్మహత్యలు.. నివేదికలో షాకింగ్‌ నిజాలు

వాళ్లు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే భద్రతా బలగాలు. వాళ్లు కంటి మీద కునుకు వేయకుండా కాపలా కాస్తేనే, మనం కంటి నిండా నిద్రపోగలుగుతాం. వారు కనుక లేకపోతే మన ప్రాణాలకే ప్రమాదం. మనకు భద్రత కల్పించేవాళ్లకు ఇప్పుడు భద్రత కరువైందనే చెప్పాలి. CRPF, BSF లాంటి కేంద్ర భద్రతా బలగాల గురించి వెలువడుతున్న నివేదికలు చూస్తే గుండె తరుక్కుపోతుంది.


భారీ వర్షాలు.. వరదలతో అతలాకుతలం

సిక్కిం వరదలతో అల్లాడి పోతుంది. భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. దీంతో సిక్కిం వరదలతో మునిగిపోయింది భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ వాగులు వంకలు ఉప్పొంగి ఉత్తర సిక్కిం ప్రాంతంలో వదరలు సంభవిస్తున్నాయి.


తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్.. మూడు రోజులు మకాం

తెలంగాణలో ఎలక్షన్‌ కౌంట్‌డౌన్‌ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో.. నిర్వహణా ఏర్పాట్లు ఊపందుకున్నాయి.


సుప్రీంకోర్టులో నేడు ఓటుకు నోటు కేసు

సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటీషన్ పై విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేశన్ ధర్మాసనం నేడు విచారించనుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది.



Tags:    

Similar News