క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈరోజు నుంచి నెల రోజుల వరకూ పండగే. నవంబరు 19వ తేదీ వరకూ వరస మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి. దాదాపు పది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ప్రపంచ మేటి జట్లు ఈ టోర్నీలో పాల్గొనుతుండటంతో ఇండియాకు నేటి నుంచి క్రికెట్ ఫీవర్ అని చెప్పాల్సి ఉంటుంది.
నేడు ఢిల్లీకి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఆయన ఢిల్లీలో రెండు రోజుల పాటు ఉంటారు. ఈరోజు రాత్రికి జన్‌పథ్ వన్ లోని నివాసంలో ఉంటారు. రేపు వామపక్ష తీవ్రవాదంపై ప్రభుత్వం నిర్వహించే సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
రామ్‌చరణ్, ధోనీ ఎందుకు కలుసుకున్నారు..?
టాలీవుడ్ మిస్టర్ కూల్ రామ్ చరణ్, కెప్టెన్ కూల్ ధోనీ.. ఒకే ఫ్రేమ్ లో కనిపించి చాలా ఏళ్ళు అయ్యింది. ఎప్పుడో 2009లో ఈ ఇద్దరు కలిసి ఒక యాడ్ లో కలిసి నటించారు. ఆ తరువాత మళ్ళీ ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఎప్పుడు కనిపించలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఉన్న ఒక పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.వైజాగ్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్.. రైల్వే స్టేషన్‌లో సరికొత్త కోచ్ రెస్టారెంట్
విశాఖ ఒక పర్యటక ప్రదేశం. చాలా మంద టూరిస్టులు విశాఖ జిల్లాను తప్పకుండా సందర్శిస్తుంటారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతత గల ప్రదేశం. ఇక్కడ అందమైన బీచ్ లు, అద్భుతమైన పార్క్ లు, పచ్చదనం పరచుకున్న ఎత్తైన తూర్పు కనుమలు, లాంటి ప్రాంతాలు మనసును ఆహ్లాదపరుస్తాయి.నేడు బెజవాడకు లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు విజయవాడకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన రాజమండ్రికి చేరుకుంటారు. ఈరోజు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ములాఖత్ కానున్నారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఆయన గత కొద్దిరోజులుగా ఉన్నారు.Breaking : సంగారెడ్డిలో గుండెపోటుతో బాలుడి మృతి
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పన్నెండేళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. బాలుడు ఖలీల్‌కు పన్నెండేళ్లు. నిద్రిస్తుండగా గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.నేడు ఢిల్లీకి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఆయన ఢిల్లీలో రెండు రోజుల పాటు ఉంటారు. ఈరోజు రాత్రికి జన్‌పథ్ వన్ లోని నివాసంలో ఉంటారు. రేపు వామపక్ష తీవ్రవాదంపై ప్రభుత్వం నిర్వహించే సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.మరో పథ్నాలుగు రోజుల రిమాండ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. ఈ నెల 19వ తేదీ వరకూ రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు రెండో దఫా విధించిన రిమాండ్ ముగియడంతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు నాయకులు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఆశించిన పార్టీలలో సీట్లు దక్కకపోవడంతో పార్టీలు మారే వారు కొంతమంది అయితే.. ఇండిపెండ్ గా గెలుస్తామనే ధీమాలో ఉన్న వ్యక్తులు మరికొందరు. ఆ కోవలోకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ చేరారు.
టీడీపి - బీజేపికి పొత్తు కుదర్చడం కోసం పవన్ కళ్యాణ్ రెండు మూడు దఫాలు ప్రయత్నం చేశాడు. అలా అడిగిన ప్రతీసారీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చు చాలు! జగన్ మనకు ఫేవర్ గానే ఉన్నాడు. నువ్వు బలమైన ప్రతిపక్షంగా ఎదుగు. 2029 పరిస్థితులను బట్టి సీఎం అవుదువు అని పవన్ కళ్యాణ్‌ని ఢిల్లీ పెద్దలు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారు.