టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

తీరం దాటిన తుఫాన్ ... పంట మొత్తాన్ని మింగేసి వెళ్లింది, భట్టి చేసిన ట్వీట్.. దేనికి సంకేతం?, 20 అడుగులు ముందుకు వచ్చిన సముద్రం

Update: 2023-12-05 12:52 GMT


భట్టి చేసిన ట్వీట్.. దేనికి సంకేతం?

తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కసరత్తులు చేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో మధిర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మల్లు భట్టి విక్రమార్క కీలక ట్వీట్ చేశారు. సీఎం పదవికి మల్లు భట్టి విక్రమార్క కూడా ఆసక్తి చూపుతున్నారు. తాను 1364 కిలో మీటర్లు, 109 రోజులు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. తాను అడుగుపెట్టిన అన్ని నియోజకవర్గాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని తెలిపారు.

సీఎం అభ్యర్థి ఖరారు.. కీలక శాఖలనూ కేటాయించిన హైకమాండ్

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ ముగిసింది. ముఖ్యమంత్రి ఎవరో హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రేవంత్ పేరును రాహుల్ గాంధీ ఖరారు చేశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మల్లు భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లను కూడా హైకమాండ్ నిర్ణయించినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ వచ్చిన నాటి నుంచే కాంగ్రెస్ బలం పుంజుకుందని రాహుల్ తో పాటు అనేక మంది నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం.

20 అడుగులు ముందుకు వచ్చిన సముద్రం

మిగ్జామ్ తుపాను బాపట్ల వద్ద తీరాన్ని దాటనుంది. ఈ నేపథ్యంలో బాపట్ల వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 20 అడుగుల ముందుకు తుపాను చొచ్చుకొచ్చింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. తుపాను నేపథ్యంలో 11 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వెర్రి వేయి తలలు వేయడమంటే ఇదే!

పిచ్చి పీక్స్ కి చేరిందని ఈ మధ్య ఓ మాట బాగా ప్రచర్మలోకి వచ్చింది. ఆంధ్ర పార్టీలకు ఇది బాగా వర్తిస్తుంది. తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలైన దగ్గర్నుంచి... ఆంధ్రలో రాజకీయ పార్టీలు.. వాటి అభిమానుల ఓవర్‌ యాక్షన్‌కి అంతు లేకుండా పోతోంది. తెలంగాణలో పార్టీలకు తామే పితామహులం అన్నట్లు... అక్కడి జనాల తలరాతను తామే నిర్ణయిస్తున్నట్లు ఇక్కడి పార్టీలు బిల్డప్‌లు ఇస్తున్నాయి. అదంతా వట్టిదే అని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

భూకక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్‌

చంద్రయాన్​-3 ప్రాజెక్ట్​లో భాగంగా చంద్రుడి వద్దకు పంపిన ప్రొపల్షన్ మాడ్యూల్‌ను విజయవంతంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. ఇది ప్రత్యేక ప్రయోగమని.. చంద్రుడిపై నుంచి నమూనాలు సేకరించే ప్రణాళికలు చేస్తున్న ఇస్రోకు తాజా ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందని తెలిపింది. నమూనాలను తీసుకొని తిరిగి వస్తే ప్రొపల్షన్ మాడ్యూల్​లోని అదనపు సమాచారం భవిష్యత్ ప్రయోగాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇస్రో భావిస్తోంది.

Congress : బుజ్జగింపులు.. తర్వాత ప్రకటన

రాష్ట్ర నేతలకు పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఢిల్లీలో బుజ్జగింపులు ప్రారంభమయ్యాయి. కేసీ వేణుగోపాల్ ఇంటికి మాజీ పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు చేరుకున్నారు. వారితో తాము ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరించనున్నారు. పార్టీ భవిష్యత్ తో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేశామని వారికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

నానికి తెలియని ఓ నిజాన్ని బయటపెట్టిన వెంకీ.. చిరు మూవీ..

ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరో హీరో చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే అలా చేసి కొందరు హిట్స్ అందుకుంటారు, కొందరు ప్లాప్స్ చూస్తారు. ఈ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్ చేయాల్సిన రెండు హిట్టు స్టోరీలను మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని చేసి కొంచెం అటు ఇటు రిజల్ట్స్ ని అందుకున్నారు. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటి..?

తీరం దాటిన తుఫాన్ ... పంట మొత్తాన్ని మింగేసి వెళ్లింది

మిచౌంగ్ తుఫాను తీరం దాటేసింది. బాపట్ల సమీపంలో తుఫాను తీరం దాటింది. తీరం దాటే సమయంలో పెద్దయెత్తున ఈదురుగాలులు వీచాయి తీరం వెంట దాదాపు వంద కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో మిచౌంగ్ తుఫాన్ వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రియలైజేషన్ మొదలయిందా బాసూ.. దెబ్బ తగిలితేకాని తెలీకపాయె

తెలంగాణ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు పంచిపెట్టినా తనను ఎందుకు ఓడించారన్నది ఆయనకు ఇప్పటికీ అర్థం కాలేదు. సుదీర్ఘ రాజకీయ నాయకుడు ఆయన. అన్నింటిలో ఆరితేరారు. అంచనాలు వేయడంలో దిట్ట. బీఆర్ఎస్ ఓటమి కాంగ్రెస్ వల్ల కాదన్నది కేసీఆర్ కు తెలియంది కాదు.

యానిమల్ మూవీలోని ప్యాలెస్.. ఆ హీరోదని తెలుసా..?

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన 'యానిమల్' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా.. వైల్డ్ యాక్షన్ వియోలెన్స్ తో ప్రేక్షకులని థ్రిల్ చేస్తుంది. కాగా ఈ సినిమాలో హీరో ఉండే ప్యాలెస్ ఒక బాలీవుడ్ స్టార్ హీరోదని మీలో ఎంతమందికి తెలుసా..?

బాహుబలితో పోలుస్తూ బ్రహ్మానందాన్ని అవమానించారు..

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఉదయం లేచిన తరువాత సోషల్ మీడియాలో మీమ్ రూపంలోనో, కామెడీ వీడియోస్ రూపంలోనో ఆయనను తప్పకుండా చూడాల్సిందే. వెయ్యకు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మి.. గిన్నిస్ వరల్డ్ రికార్డుని క్రియేట్ చేశారు.


Tags:    

Similar News