ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ అన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.
చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్ ను హీరో విజయ్ అభిమానులు ధ్వంసం చేశారు. విజయ్ కొత్త చిత్రం 'లియో' ట్రైలర్‌ను ప్రదర్శిస్తున్న సందర్భంగా విజయ్ అభిమానులు థియేటర్ లోని సీట్లను విరగ్గొట్టేశారు. లియో ట్రైలర్ కు చూడడానికి వందలాది మంది విజయ్ అభిమానులు థియేటర్ లోపలికి వచ్చారు
తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తన గన్ మెన్ పై చేయిచేసుకున్నారు. అది కూడా కెమెరాల ముందు ఆయన దురుసుగా ప్రవర్తించారు. ఇదంతా ఒక బొకే కోసం జరిగింది. తలసాని పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ అలీ బొకే ఎక్కడంటూ గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో సహనం కోల్పోయి గన్ మెన్ చెంప చెళ్లుమనిపించారు.
వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్‌లో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన క్వాట్రెండ్ సాఫ్టువేర్ కంపెనీని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల బాగు కోసం మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును సోమవారం వెల్లడిస్తానని తెలిపారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబు గత ఇరవై ఎనిమిది రోజుల నుంచి రాజమండ్రి జైలులోనే ఉన్నారు.
వైఎస్ జగన్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎత్తుగడల విషయంలో పెద్ద అనుభవాన్నే సంపాదించారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును, ఆయన అనుకూల వర్గాన్ని నాలుగేళ్ల నుంచి దడదడలాడిస్తున్నారంటే ఆషామాషీ కాదు. జగన్ డిక్షనరీలోనే రాజీ లేదంటారు.
తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన కమ్మ సామాజికవర్గం నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈరోజు కేసీ వేణుగోపాల్ ను కలసి తమకు టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం చేయకుండా చూడాలని కోరనున్నారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీలోని కమ్మ సామాజికవర్గం నేతలు మాజీ పార్లమెంటు సభ్యురాలు రేణుక చౌదరి నేతృత్వంలో భేటీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభమైంది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పథకాన్నిమంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. టిఫిన్ రుచి ఎలా ఉందంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. మోడీ పసుపు బోర్డు ప్రకటించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.