తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులన్నీ కూలేపోయే పరిస్థితి ఉందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కుక్కతోక తగిలితేనే ప్రాజెక్టులు కూలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్న ఆమె కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దానికి రీ డిజైన్ చేశారన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కమలం పార్టీ ఇరికించిందనే చెప్పాలి. తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు అధికారికంగా ఖరారయింది. సీట్ల పంపకం కూడా దాదాపు పూర్తయింది. నేడో, రేపో ఉమ్మడి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ పోటీ చేయడానికి ప్రత్యేక కారణమంటూ లేదు.
ఏపీలో దీపావళి సెలవును మారుస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీపావళి సెలవును ఈ నెల 13వ తేదీకి మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీలో దీపావళి సెలవు ఇంతకు ముందు నవంబర్ 12న ఉండగా, తాజాగా దీనిని 13కు మార్పు చేసింది. గతంలో నవంబర్ 12న దీపావళి సెలవుగా ప్రకటించారు.
శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారత్ లో ఘోర పరాజయం తర్వాత క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాత్కాలిక కమిటీని నియమించింది. వరల్డ్ కప్ లో శ్రీలంక పేలవమైన ప్రదర్శన చూపింది. సెమీ ఫైనల్ కు కూడా చేరుకోలేకపోయింది.
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న క్రేజ్ ఆమెది. దీంతో ఆమెకు సంబంధించిన ఏ చిన్న వీడియో అయినా, ఫోటో అయినా ఇట్టే వైరల్ అయ్యిపోతుంటాయి.
భారత్ వరస విజయాలతో వరల్డ్ కప్ లో దూసుకెళుతుంది. ఇక పాయింట్లలో టేబుల్‌లో భారత్ ను కొట్టే మొనగాడు లేడు. ఇప్పటి వరకూ వరసగా ఎనిమిది విజయాలు సాధించి పదహారు పాయింట్లు సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది. మిగిలిన జట్లు కొన్ని ఓటములు చవి చూడటంతో ఇక పాయింట్ల పట్టికలో భారత్ ఉన్న ప్రధమ స్థానానికి చేరుకునే అవకాశం లేదు. సెమీ ఫైనల్స్ త్వరలో ప్రారంభం కాబోతున్నాయి.
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'గుంటూరు కారం'. మహేష్ బాబుని ఇప్పటి వరకు చూపించినంత మాస్ గా ఈ మూవీలో చూపించబోతున్నారంటూ మేకర్స్ చెప్పుకు రావడం, రిలీజ్ అవుతున్న పోస్టర్స్ లో కూడా ఆ రేంజ్ మాస్ కనిపిస్తుండడంతో..
హైదరాబాద్ లో మెట్రో రైలు వచ్చిన తర్వాత ప్రయాణం సుఖవంతంగా జరుగుతుంది. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేర్చడంలో మెట్రో ఎంతో ఉపయోగపడుతుంది. ఒకసారి మెట్రో రైలు ప్రయాణానికి అలవాటు పడితే ఇక సొంత వాహనాన్ని తీసే ప్రయత్నం ఎవరూ చేయరు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరికాసేపట్లో ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించనున్నారు.
విజయవాడ ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. బస్సు ప్రమాదకరం దురదృష్టకరమన్న ఆయన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. విచారణ తర్వాత అసలు విషయం తెలుస్తుందని తెలిపారు. 24 గంటల్లో విచారణ పూర్తి చేసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటామని ద్వారకా తిరుమలరావు మీడియాకు తెలిపారు.