రేపు ఐదుగురు మంత్రుల ప్రమాణం.. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు రాగానే రేవంత్‌కు పిలుపు
రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. ఈ ఐదుగురు సీనియర్ నేతలుంటారని తెలిసింది. వీరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని తెలుస్తోంది.
భేటీ అసలు కారణం అదేనా... అలా ముందుకు వెళ్లకపోతే?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ భేటీ రాజకీయంగా మరోసారి చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన రెండూ కలసి పోటీకి దిగనున్నాయి. జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబును కలిసిన తర్వాత బయటకు వచ్చి పవన్ కల్యాణ్ అధికారికంగా పొత్తు విషయాన్ని ప్రకటించారు.
"పుష్ప" నటుడి అరెస్ట్.. బెదిరింపులకు దిగడంతో
పుష్పలో నించిన జగదీశ్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగుతున్నాడని జగదీశ్ పై ఈ కేసు నమోదు చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉన్నప్పడు తీసిన ఫొటోలను తాను షేర్ చేస్తానని బెదిరించడంతో కేసు నమోదయింది. అరెస్ట్ చేసిన అనంతరం జగదీశ్ ను కోర్టులో హాజరుపర్చారు.
తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్.. 'యానిమల్'లోని సాంగ్‌కి డాన్స్ కంపోజ్ చేశాడా..?
రణబీర్ కపూర్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోహీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యాక్షన్ వైలెంట్ మూవీ 'యానిమల్'. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. సోషల్ మీడియా టైం లైన్ కూడా ఈ మూవీ ఫీడ్ తోనే ఫుల్ అయ్యిపోతుంది. ఇక ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నెటిజెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.
సీఎం కాబోయే ముందు రేవంత్ లేఖ
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇందిరమ్మ రాజ్యం రేపటి నుంచి ప్రారంభం కాబోతుందన్నారు. అమరుల త్యాగం, విద్యార్థుల పోరాటం, సోనియా గాంధీ సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అందరి ఆకాంక్షలు నెరవేరే సమయం దగ్గరలోనే ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తమిళనాడు వణికింది.. ఇంకా వణుకుతూనే ఉంది
మిచౌంగ్ తుఫాను దెబ్బకు తమిళనాడు వణికిపోయింది. తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మంది మరణించారు. ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలోనే జరిగిందని ప్రాధమికంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఖరీదైన కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హైదరాబాద్‌లో ఓటేస్తే ఇక్కడ ఓటు తొలగించాల్సిందే
హైదరాబాద్ లో ఓటేసిన వారికి ఏపీలో ఓట్లు తొలగించాలని ఏపీ మంత్రులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఎన్నికల అధికారిని మంత్రులు జోగి రమేష్, వేణుగోపాల కృష్ణలు కలిశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాలుగు లక్షల మంది ఓటర్లు హైదరాబాద్ లో ఉన్నారని, వాళ్లంతా ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు వేశారని, త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించవద్దని ఈ సందర్బంగా మంత్రులిద్దరూ ఎన్నికల కమిషనర్ ను కోరారు
ఏపీకి రానున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 22, 23 తేదీల్లో పర్యటించనున్నారు. ఓటర్ల జాబితా అక్రమాలపై ప్రతిపక్ష నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఈ బృందం ప్రత్యేకంగా పరిశిలించనున్నట్లు తెలిసింది. దొంగ ఓట్ల పేరుతో అసలు ఓట్లను తొలగించారంటూ విపక్ష టీడీపీ పెద్దయెత్తున ఆరోపణలు చేసింది.
ఇగో హర్టెడ్...అందుకే రాజీనామాకు సిద్ధమవుతున్నారట
కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేయనున్నారా? శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అవును.. ఇప్పుడు ఇది తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ఓటమి తర్వాత ఈ విషయాన్ని స్పష‌్టం చేయకపోయినా ఆయన మనసెరిగిన వారు మాత్రం శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారని మాత్రం చెబుతున్నారు.
రేవంత్ ప్రమాణానికి చంద్రబాబు హాజరవుతారా? హాట్ టాపిక్
రేవంత్ రెడ్డి రేపటి ప్రమాణస్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారా? లేదా? అన్న చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి తాను సీఎంగా రేపు ఎల్.బి. స్టేడియంలో బాధ్యతలను చేపట్టనున్నారు. అయితే ఈ ప్రమాణస్వీకార సభకు చంద్రబాబుకు ప్రత్యేకంగా రేవంత్ ఆహ్వానం పంపుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )