లేటెస్ట్ టాప్ 10 తెలుగు న్యూస్ 7-9-2023

లేటెస్ట్ టాప్ 10 తెలుగు న్యూస్

Update: 2023-09-07 09:47 GMT

తిరుమలలో మరోసారి అపచారం

తిరుమల కొండపై మరోసారి అపచారం జరిగింది. తిరుమల పై నుంచి విమానం వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం పై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లినట్టుగా భక్తులు చెబుతున్నారు.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

22 వేల మందికి ఐటీ నోటీసులు.. ఎందుకో తెలుసా?

ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులపై ప్రత్యేక నిఘా పెడుతోంది. ఎవరు ఎంత పన్ను చెల్లిస్తున్నారు..? వారు చెల్లింపు పన్ను సరిగ్గానే ఉందా? లేదా అనే విషయంపై ఆరా తీస్తోంది. తప్పుడు లెక్కలు అందించిన వారికి నోటీసులు పంపిస్తోంది.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

పవన్ మూతికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా: మంత్రి రోజా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల అంశంపై మంత్రి రోజా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. ‘‘ముడుపుల కేసులో .... ధైర్యంగా విచారణ ఎదుర్కొంటాడా..? లేక... బామ్మర్దిలా .... మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా ?

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

జవాన్ సినిమా రివ్యూ

పఠాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్.. ఇప్పుడు 'జవాన్' సినిమాతో బాక్సాఫీసు మీద దండయాత్రకు వచ్చాడు. తమిళ డైరెక్టర్ అట్లీతో జతకట్టాడు షారుఖ్ ఖాన్. జవాన్‌లో డ్రామా, భావోద్వేగాలు, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మాస్ ఎంటర్టైనర్ థియేటర్లలోకి వచ్చింది.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

జస్టిస్ ఎన్వీరమణ vs శ్రీరాం పంచు

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ఎన్ వి రమణ ను ఎస్ ఐఎంసీకి నియామకం చేసినందుకు నిరసనగా,భారత మధ్యవర్తిత్వ లాయర్ గా పేరుగాంచిన సీనియర్ అడ్వకేట్ శ్రీరాం పంచు సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్రాక్టిషనర్ పదవికి రాజీనామా చేశారు.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఆ యాంటాసిడ్ సిరప్ వాడొద్దు..!

అబాట్‌ ఇండియా ఫార్మా కంపెనీ తయారు చేసిన యాంటీసిడ్‌ సిరప్‌ ‘డైజీన్‌ జెల్‌’ అనే మందును వాడొద్దని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) సూచించింది. దేశంలోని అత్యున్నత మందుల నియంత్రణ యంత్రాంగం... డైజీన్‌ వాడకంపై తన వెబ్‌సైట్‌లో ఓ హెచ్చరిక జారీ చేసింది.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గుడ్‌న్యూస్‌.. కొత్తగా యూపీఐ ఏటీఎంలు.. కార్డు లేకపోయినా డబ్బులు..

బ్యాంకు వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ వచ్చింది. ఏటీఎంల విషయంలో కొత్త సర్వీసు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పెరిగిపోతున్న టెక్నాలజీ కారణంగా చాలా మంది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి. ఇక యూపీఐ ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

‘ఇండియా’ పుట్టుపూర్వత్రాలు

టిబెట్ ప్రాంతంలోని హిమాలయాల నుంచి ప్రవహించే ఇండస్ (సింధు)నది 2,900 కిమీ ప్రవహిస్తుంది. దీని పరీవాహకప్రాంతమైన మన దేశాన్నిఆంగ్లేయులు ఇండియాగా పిలిస్తే, మొఘలాయిలు ఈ సింధునదిని హిందూ అని పిలవడం వల్ల హిందూదేశంగా పిలుస్తారు. వాస్తవానికి హిందూ పదంలేదని చరిత్రకారుల వాదన.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

17న కాంగ్రెస్‌ బహిరంగ సభ.. ఐదు కీలక హామీలను ప్రకటించనున్న సోనియా

తెలంగాణ వచ్చేది కాంగ్రెస్సేనని, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయాలని, అందరు సమన్వయంతో మెలగాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ సూచిచారు. బుధవారం రాత్రి తాజ్‌కృష్ణా హోటల్‌లోని రేవంత్ రెడ్డి, మాణిక్‌రావ్‌ ఠాక్రే, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు నాయకులతో భేటీ అయ్యారు.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇది సరికాదు.. ప్రధానికి సోనియా లేఖపై మంత్రి ప్రహ్లద్‌ జోషి కౌంటర్

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ఏజెండాపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. తమను సంప్రదించకుండా సమావేశాలను ఖరారు చేశారని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారరు. అయితే సోనియా గాంధీ లేఖపై స్పందించారు కేంద్ర పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Tags:    

Similar News