టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-11-08 12:35 GMT


ప్రధాని మోదీ సభకు దూరం.... ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న సభకు రాలేదంటే?

రాజాసింగ్ అంటే కరడుగట్టిన కాషాయం నేత. ఆయన మాటలు.. చేష్టలు ఎప్పుడూ రెచ్చగొట్టే విధంగా ఉంటాయంటారు. హిందూ సమాజం పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతూ గోషా మహల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున తెలంగాణలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ అంటేనే ఆయనకున్న స్పెషాలిటీ గురించి వేరే విధంగా చెప్పాల్సిన పనిలేదు.

Lk Advani : పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ కు 96 ఏళ్లు

లాల్ కృష్ణ అద్వానీ నేటితో 96వ ఏట అడుగు పెట్టారు. రాజకీయాల్లో ఒక ట్రెండ్ ను సెట్ చేసిన అద్వానీ నేడు పాలిటిక్స్ కు దూరమైనా ప్రతి బీజేపీ కార్యకర్తకూ ఆయనొక మార్గదర్శి. ఈరోజు బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే అందులో యాభై శాతం భాగస్వామ్యం అద్వానీదేనంటారు.

Bangalore : చెత్త కుండీలో 25 కోట్లు

చెత్తకుప్పను ఎవరైనా చీదరించుకుంటారు. ముక్కుమూసుకుని దాని పక్క నుంచి వెళ్లేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారు. కానీ ఆ చెత్త కుప్పలో 25 కోట్ల రూపాయలు దాగి ఉంటాయని ఎవరికి మాత్రం తెలుసు. అందుకే చెత్తను కూడా తేలిగ్గా తీసిపారేయడానికి వీలులేదని బెంగళూరులో జరిగిన ఘటన రుజువు చేస్తుంది.

World Cup 2023 : మ్యాక్స్‌వెల్ వీర బాదుడు... డబుల్ సెంచరీతో సెమీ ఫైనల్‌కు

వరల్డ్ కప్ లో మరో అద్భుతం. ఎవరూ ఊహించనది. వన్డే క్రికెట్ చరిత్రలో.. వరల్డ్ కప్ లో అరుదైన ఘట్టం. ఆస్ట్రేలియా - ఆప్ఘనిస్థాన్‌ల మధ్య మ్యాచ్ చూసిన వారెవరికైనా క్రికెట్ అంటే మరింత మక్కువ కలుగుతుంది. మ్యాక్స్‌వెల్ రెండు వందల పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు

దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మానవ రవాణా అంశంపై ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, త్రిపుర, పుదుచ్చేరిలలో సోదాలు జరుపుతున్నారు అనేకమంది అనుమానితుల ఇళ్లలో దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

డైనోసార్ ఆగయా.. ఇక 'సలార్' ప్రమోషన్స్ షురూ..

Prabhas : గత కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధ పడుతున్న ప్రభాస్.. ఇటీవల చికిత్స కోసం యూరప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలలోనే అందుకు సంబంధించిన సర్జరీ పూర్తి చేసుకున్న ప్రభాస్ కంప్లీట్ రెస్ట్ తీసుకోవాల్సి ఉండడంతో.. గత నెల రోజుల నుంచి అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడు.

తుమ్మల ఇంట్లో సోదాలు

కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఆయన ఇంట్లో పెద్దయెత్తున డబ్బులు దాచి పెట్టారన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికే డబ్బులు పెద్దమొత్తంలో దాచి ఉంచారని ఫిర్యాదు అందడంతోనే దాడులు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

నవీన్ పోలిశెట్టిపై భారత్ క్రికెటర్ ప్రశంసలు..

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. వరుస హిట్స్ అందుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు. రీసెంట్ గా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది సూపర్ హిట్టుని సొంతం చేసుకున్నాడు. తెలుగుతో పాటు సౌత్ లాంగ్వేజ్స్ తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది.

మళ్లీ విక్టరీ రావుగారి..దేనట... అదే కారు పార్టీ నేతల ధీమా

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనాలను తన వైపునకు తిప్పుకోవడంలో దిట్ట. ఆయనకు మించిన నేత మరొకరు ఉండరు. తెలంగాణ సెంటిమెంట్ అయినా..ప్రత్యర్థులతో పొత్తులపై కాని ఆయన పల్లెత్తు మాట్లాడకుండానే ప్రజలను తమ వైపునకు తిప్పుకునే సామర్థ్యం ఉన్న నేత.

చిన్నమ్మ ఆరాటమే కానీ.. మరిది మనసు మార్చుకుంటారా ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటినుంచే హీటెక్కాయి. అధికార పార్టీపై అన్ని పార్టీలూ విరుచుకుపడుతున్నాయి. ఇక ఏపీలో గత కొద్ది రోజులుగా బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. పురంద్రీశ్వరి గత కొంత కాలంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలను పెంచడంతో ఆమెను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు కూడా తగ్గేదేలే అంటూ వారు కూడా మండి పడుతున్నారు.

Diwali : దీపావళి పండగ ఇందుకొచ్చిందట... అందుకే అలా చేస్తారు

ఆశ్వీయుజ మాసం వచ్చిందంటే చాలు... పిల్లల నుంచి పెద్దలతో సహా అందరూ సంతోషంగా ఉంటారు. దానికి కారణం ఈ మాసంలో వచ్చే దీపావళి పండగ. దీపావళి పండగ ఏటా ఆశ్వీయుజ మాసంలో వస్తుంది. దీపావళిని చిన్న పిల్ల నుంచి పెద్దల వరకూ అందరూ ఆనందంగా జరుపుకుంటారు.

YSRCP :రేపటి నుంచి "వై ఏపీ నీడ్స్ జగన్"

రేపటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికీ సంక్షేమ పథకాలను అందచేశామని తెలిపారు.

Tags:    

Similar News