టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-10-09 12:50 GMT


బీఆర్ఎస్ అభ్యర్థుల బేజారు.. బలమైన కారణమిదే

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. నవంబరు 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అయితే పోలింగ్ తేదీకి నేటికి దాదాపు యాభై రోజులకు పైగానే సమయం ఉంది. అభ్యర్థులకు చేతి చమురు మామూలుగా వదలదు.

భారత్ ను విడిచి వెళ్ళిపోయిన జైనాబ్ అబ్బాస్

పాకిస్థాన్ టీవీ ప్రెజెంటర్ జైనాబ్ అబ్బాస్ గతంలో చేసిన వివాదాస్పద ట్వీట్ల కారణంగా ఆమె భారత్ ను తిరిగి వెళ్లాల్సి వచ్చింది. భారత్ లో జరుగుతున్న ప్రపంచ కప్ కు జైనాబ్ అబ్బాస్ ను ప్రెజెంటర్ గా ఎంపిక చేశారు. అయితే ఆమె గతంలో చేసిన ట్వీట్లు ఆమెను వెంటాడాయి.

Breaking : నవంబరు 9న కేసీఆర్ నామినేషన్

నవంబరు 9న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఆయన గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లో అదేరోజు నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 15న బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. 15 నుంచి వరసగా నాలుగు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు.

Breaking : తెలంగాణలో నవంబరు 30న పోలింగ్

కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మిజోరాం రాష్ట్రాలకు షెడ్యూల్ ను చీఫ్ ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మిజోరాంలో నలభై, తెలంగాణలో 119, మధ్యప్రదేశ్ 230, రాజస్థాన్ 200, ఛత్తీస్‌గడ్ లో 90 స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించారు.


జనంలోకి వెళ్లండి.. పెద్దగా సమయం లేదు : జగన్

వైసీపీ కొత్తగా నాలుగు కార్యక్రమాలను ప్రకటించింది. నాలుగు కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. వైసీపీ సర్వసభ్య సమావేశం కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమయింది. ప్రాంగణానికి చేరుకున్న వైసీపీ అధినేత జగన్ తొలుత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

ఇక్కడ ఏదీ కలిసిరావడం లేదే?

స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను ఏపీ హై కోర్టు కొట్టివేసింది. ఫైబర్‌నెట్‌, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఈ తీర్పు వచ్చింది.

యాత్ర-2 పోస్టర్స్.. ఆ డైలాగ్ చూశారా?

యాత్ర మొదటి భాగం ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊహించని సక్సెస్ సాధించింది ఈ సినిమా. దర్శకుడు మహి వి రాఘవ్ కు మంచి పేరు వచ్చింది. సినిమాను మరీ టూమచ్ పొలిటికల్ వే లో కాకుండా దివంగత రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర చుట్టూ ఎంతో బాగా అల్లుకుని తీశారు.


ఆస్ట్రేలియా చేసిన అతి పెద్ద తప్పే.. చివరకు

ఆస్ట్రేలియా చేసిన తప్పు భారత్ కు వరమైంది. డేంజర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కొహ్లి క్యాచ్ ను జార విడిచడంతో మ్యాచ్ భారత్ కు దక్కింది. కేవలం పన్నెండు పరుగుల వద్ద కొహ్లి ఇచ్చిన క్యాచ్ వదిలేయడంతో ఇక విరాట్ ను ఎవరూ ఆపలేకపోయారు. ఒకవైపు విరాట్ కొహ్లి, మరొక వైపు కె.ఎల్ రాహుల్ ఆస్ట్రేలియా బౌలర్లను ఒక ఆటాడుకున్నారు.

దసరాకి ముందే అన్‌స్టాపబుల్-3.. ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరంటే..?

బాలకృష్ణ ఈసారి దసరాకి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. 'భగవంత్ కేసరి' సినిమాతో బిగ్ స్క్రీన్ పై సందడి చేయడానికి అక్టోబర్ 19న వస్తున్న బాలకృష్ణ.. అంతకుముందే పండుగా వారంలో అన్‌స్టాపబుల్ సీజన్ 3 తో బుల్లితెర పై సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.

అక్కడ పొత్తు ఓకే.. మరి ఇక్కడ?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలవుతూనే కొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులని ప్రకటించేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాల సంక్షోభం నెలకొన్న సందర్భంలో చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచిన‌ పవన్ కళ్యాణ్.. ఎవరూ ఊహించని విధంగా ఎన్డీయే నుంచి వైదొలిగి టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల ఘంటికలను మ్రోగించారు.

Tags:    

Similar News