భారతీయ జనతా పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. పథ్నాలుగు మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. నామినేషన్లకు చివరి రోజున ఈ పథ్నాలుగు మంది అభ్యర్థులను ఖరారు చేస్తూ బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ 100 స్థానాలకు నాలుగు విడతలుగా జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గత ఏడాది నవంబర్ 15న 79 ఏళ్ళ వయసులో మరణించిన సంగతి అందరికి తెలిసిందే. కృష్ణ మరణం ఘట్టమనేని ఫ్యామిలీని మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ ని కూడా తీవ్రంగా బాధించింది. ఆయన మరణించి ఏడాది గడుస్తున్నా ఇంకా కృష్ణని గుర్తు చేసుకుంటూ ఏవో కార్యక్రమాలు చేస్తూనే ఉంటున్నారు.
తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. నిన్నటి వరకూ మొత్తం 2,028 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈరోజు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ గడువు పూర్తి కావడంతో ఇక రేపటి నుంచి ప్రచారాన్ని అభ్యర్థులు మరింత వేగం పెంచుతున్నారు
కాంగ్రెస్ లో టిక్కెట్ దక్కకపోవడంతో పటాన్‌చెర్వు కు చెందిన నీలం మధు బీఎస్పీలో చేరారు. ఆయన నామినేషన్ వేయడానికి బయలుదేరాడు. జాబితాలో నీలం పేరును ప్రకటిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే నీలం మధుకు సీటు ఇవ్వడాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యతిరేకించారు.
వైకుంఠం ద్వార దర్శనం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్ లో పెట్టిన 21 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకున్నారు. ఈ టెక్కెట్లతో తిరుమల తిరుపతి దేవస్థానానికి 6.756 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్ లో పెట్టిన పథ్నాలుగు నిమిషాల్లోనే 80 శాతం టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతల నుంచి క్యాడర్ వరకూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీలోనూ తమదే విజయం అన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆ వేవ్ అలా సరిహద్దులు దాటి ఆంధ్రవైపు వస్తుందని విశ్వసిస్తున్నారు.
Virat Kohli : భారత స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక పాపకి కూడా జన్మనించిన సంగతి తెలిసిందే. 2020 సంవత్సరంలో లాక్ డౌన్ టైములో ఈ స్టార్ కపుల్.. తమ మొదటి బేబీ బర్త్ గురించిన అప్డేట్ ఇచ్చారు. అనుష్క ప్రెగ్నెంట్ అని తెలియజేసేలా ఒక ఫోటో షేర్ చేశారు.
రేపు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి రానున్నారు. అక్కడి నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కత్తి దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మధ్య ఘర్షణ కారణంగా ఈ దాడి జరిగిందని చెబుతున్నారు. మనోజ్ అనే ఉద్యోగిపై మరో మహిళా ఉద్యోగి కత్తితో దాడి చేసింది.