లోక్ సభ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. అయితే గత పన్నెండు రోజుల నుంచి జరుగుతున్న డ్రామానే ఈరోజు కూడా జరగడం విశేషం. లోక్ సభ ప్రారంభం అయిన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఎప్పటిలాగానే పోడియంను చుట్టుముట్టారు. నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రామహాజన్ లోక్ సభ చివరి రోజు కావడంతో సభ్యులు శాంతంగా ఉండాలని సూచించారు. ఒక దశలో అన్నాడీఎంకే సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు కొంత సేపు శాంతంగా ఉన్నారు. ఈ సమయంలో పార్లమెంటు సమావేశాల్లో ఏ బిల్లులు చేపట్టిందీ, ఎంత సేపు చర్చలు జరిగిందీ స్పీకర్ సభకు వివరించారు. తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారు. సమావేశాలు చివరిరోజున ప్రధాని మోడీ సభకు రావడం విశేషం. దీంతో లోక్ సభ నిరవధిక వాయిదా పడింది.