సీఎం అభ్యర్ధిగా లోకేష్… ?

టీడీపీకి సీఎం అభ్యర్ధి ఎవరు. వచ్చే ఎన్నికల తరువాత తెలుగుదేశం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు. ఇది తెలుగుదేశం వారికి సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ అందరికీ [more]

Update: 2021-09-16 02:00 GMT

టీడీపీకి సీఎం అభ్యర్ధి ఎవరు. వచ్చే ఎన్నికల తరువాత తెలుగుదేశం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు. ఇది తెలుగుదేశం వారికి సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ అందరికీ తెలుసుకోవాలని ఆరాటం ఉంటుంది. అంతకు మించి వచ్చే ఎన్నికలలో చంద్రబాబు సీఎం క్యాండిడేట్ అయితే కధ ఒకలా ఉంటుంది. లోకేష్ ని ముందు పెడితే మరోలా సీన్ ఉంటుంది. అందుకే లోకేష్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని వైసీపీ నేతలు గట్టిగానే సవాల్ చేస్తున్నారు. ఈ రోజున బాబు కంటే ఎక్కువగా జనాలలో లోకేష్ తిరుగుతున్నారు. ఆయనే భావి వారసుడు అంటూ చంద్రబాబు తెర వెనక ఉండి డైరెక్ట్ చేస్తున్నారు.

ఆ దూకుడుతో …

లోకేష్ బాడీ లాంగ్వేజ్ తో పాటు లాంగ్వేజ్ కూడా మార్చేశారు. డైరెక్ట్ గా సీఎం జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. నాతో చర్చకు రా జగన్ అంటూ సవాల్ కూడా చేస్తున్నారు. కొడుకుకు ఈ విధంగా ట్రైనింగ్ ఇప్పిస్తున్న చంద్రబాబు దమ్ముంటే ఆయన్నే వచ్చే ఎన్నికల్లో మా సీఎం క్యాండిడేట్ అని ప్రకటించాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు. లోకేష్ భాష సంస్కార హీనంగా ఉందని, ఆయన రాజకీయ అవగాహన లేమి కూడా ఎక్కడికక్కడ బయటపడుతోందని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. లోకేష్ మాటలను చూసి చంద్రబాబు బాగా మురిసిపోతున్నారని, ఆ పాటి భాగ్యానికి లోకేష్ నే సీఎం అంటూ ప్రకటిస్తే జనమే తీర్పు చెబుతారని సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు.

అంత సీన్ ఉందా…?

వచ్చే ఎన్నికల్లో లోకేష్ ని సీఎం గా ప్రకటించి ఎన్నికలకు వెళ్ళే సీన్ చంద్రబాబుకు ఉందా అన్నదే చర్చ ఇక్కడ. జగన్ ని విమర్శించడానికి తాను కాదు, లోకేష్ చాలు అంటున్న చంద్రబాబు, టీడీపీకి అసలైన వారసుడు లోకేషే అని నమ్ముతున్న పెద్దాయన మరి అదే లోకేష్ ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి అని జనాలకు చెప్పలేరా అన్న డౌట్లు తమ్ముళ్లలోనూ ఉన్నాయి. లోకేష్ ను ముందు పెడితే వచ్చే నాలుగు ఓట్లూ రావు అన్న సంగతి చంద్రబాబుకు పక్కాగా తెలుసని, అయినా సరే కొడుకు వీరత్వం శూరత్వం అంటూ వీర లెవెల్ లో అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

ఆగే రకమేనా…?

సరే చంద్రబాబు స్ట్రాటజీ వేరు. కొడుకుని తన కనుసన్నలోనే ఉంచి రేపటి సీఎం గా తీర్చిదిద్దాలన్నదే ప్లాన్. కానీ తనకు బదులుగా జనాల్లోకి లోకేష్ ని పంపితే ఆయనలో ఆశలు చెలరేగవా అన్నది కూడా చూడాలి కదా. ఇప్పటికే తాను వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ ని భావిస్తున్న చినబాబు వచ్చేది మేమే ని గర్జిస్తున్నారు. అలాంటి లోకేష్ ని పక్కన పెట్టి బాబు సీఎం సీటు ఎక్కగలరా, ఎక్కినా ఆయన కుదురుగా పాలించగలరా అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయంతో చినబాబు ఎదుగుతున్నారా. దిగిపోతున్నారా అన్నది కాలమే చెప్పాలి మరి.

Tags:    

Similar News