సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ప్రభాస్

రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సిరీస్ పాన్ ఇండియా చిత్రంగా ఎన్ని సెన్సషన్స్ క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. మళ్లీ ప్రభాస్ [more]

Update: 2019-10-10 11:16 GMT

రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సిరీస్ పాన్ ఇండియా చిత్రంగా ఎన్ని సెన్సషన్స్ క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. మళ్లీ ప్రభాస్ కి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రావాలంటే మళ్లీ అతను రాజమౌళి తో వర్క్ చేయాలి. కానీ అది అంత ఈజీ అయ్యేపని కాదు. రాజమౌళి మళ్లీ ఇప్పటిలో ప్రభాస్ తో చేసే అవకాశం లేదు. రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు ఎవరు అని ప్రభాస్‌ టీమ్‌ బాగా అన్వేషిస్తోంది. అప్పుడు వారి ద్రుష్టిలో సైరా దర్శకుడు సురేందర్‌ పడ్డాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

సురేందర్ రెడ్డితో ప్రభాస్….

సురేందర్ రెడ్డి అంత భారీ బడ్జెట్‌ చిత్రాన్ని, అంతటి భారీ తారాగణాన్ని బాగా హ్యాండిల్‌ చేయడంతో పాటు విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించి అన్ని బాగా హేండిల్ చేసాడని సో అతనితో ప్రభాస్ కి సినిమా పడితే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ విషయాన్నీ యువి క్రియేషన్స్‌ వారు కూడా అంగీకరించారట. ప్రభాస్ తో జేమ్స్‌బాండ్‌ తరహా యాక్షన్‌ చిత్రం చేస్తే తనకి నేషనల్‌ వైడ్‌గా మంచి గుర్తింపు వస్తుందని యువి వాళ్ళు భావిస్తున్నారు. ఆల్రెడీ ఇదే విషయాన్నీ సురేందర్ రెడ్డి కి చెప్పినట్టు ఆయన కొంత సమయం తీసుకుని కథ రెడీ చేసుకుని తీసుకుని వస్తా అని చెప్పడం జరిగిపోయాయి అని తెలుస్తుంది. అన్ని కుదిరితే ‘జాన్’ తరువాత వీరి కాంబినేషన్ లో సినిమా ఉండే అవకాశముందని సమాచారం.

 

 

Tags:    

Similar News