రాజు కోరి మరి గొయ్యి తవ్వుకున్నారా ?
రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీడియా లో తెరపై కరోనా వార్తలను సైతం పక్కన పెట్టి ఆవిష్కృతం అయిన స్టోరీ. వైసిపి పార్టీ నుంచి నర్సాపురం [more]
రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీడియా లో తెరపై కరోనా వార్తలను సైతం పక్కన పెట్టి ఆవిష్కృతం అయిన స్టోరీ. వైసిపి పార్టీ నుంచి నర్సాపురం [more]
రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీడియా లో తెరపై కరోనా వార్తలను సైతం పక్కన పెట్టి ఆవిష్కృతం అయిన స్టోరీ. వైసిపి పార్టీ నుంచి నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో గెలిచారు రఘురామ కృష్ణంరాజు. ఆ తరువాత ఆయనకు వైసిపి అధినేతకు ఎక్కడ చెడిందో కానీ సొంత పార్టీపై యుద్ధం మొదలు పెట్టారు. మొదట్లో ఆయన వ్యవహారాలను లైట్ తీసుకున్న వైసిపి తరువాత ఆయన చర్యలు పరిశీలించి రాజు పార్లమెంట్ సభ్యత్వం రద్దుకు అడుగులు వేసింది.
పలుకుబడితో..?
కేంద్రంలోని మోడీ సర్కార్ లో పలుకుబడి బాగానే ఉండటంతో రఘురామ కృష్ణంరాజు పదవి పోకుండా ఇప్పటివరకు నెట్టుకొస్తున్నారు. అక్కడితో ఆయన ఆగివుంటే బాగుండేది. సొంత పార్టీ నుంచి బహిష్కృతం అయితే తన పదవికి డోకా ఉండదన్న వ్యూహంతో రఘురామ కృష్ణంరాజు కొన్ని ఛానెల్స్ ను వేదికగా చేసుకుని ప్రభుత్వంపై శరంపరంగా విమర్శల వర్షం కురిపిస్తూ వస్తూనే వున్నారు.
ఇటీవల మరీ శృతిమించడంతో …
ఇటీవల రఘురామ కృష్ణంరాజు వ్యవహారం మరీ శృతిమించి రాగాన పడింది. ఇదంతా శిశుపాలుడి తప్పులను కృష్ణుడు లెక్కపెట్టి సుదర్శనం విడిచి హతమార్చినట్లు జగన్ తనకున్న అస్త్రాలను వదిలిపెట్టేశారు. ఇంకేముంది ఇంతకాలం కొన్ని ఛానెల్స్ వేదికగా రాజకీయ డ్యాన్స్ చేసిన రాజా వారు పుట్టిన రోజు పూటా రోడ్డున పడ్డారు. తిరగని కోర్ట్ లేదు ప్రశ్నించని పోలీసులు లేరు అన్నట్లు అయ్యింది ఆయన పని. ఇదంతా అయన కోరి తెచ్చుకున్న తంతే కదా అన్నది ఇప్పుడు సామాన్యుల్లో వినిపిస్తున్న టాక్. మరో పక్క పొలిటికల్ గా మాత్రం అధికారపక్షం మినహా అంతా రఘురామ కృష్ణంరాజు పక్షమే నిలిచారు.
అంత తేలిగ్గా…?
ఇది కూడా సహజమే. ఈ విపత్తు సమయంలో ఇది అవసరమా అన్నది విపక్షాల ప్రశ్న. అయితే జగన్ సర్కార్ కి మాత్రం ఇదే అవసరం అనేది తేలిపోయింది. ప్రత్యర్థులను వెంటాడి వేటాడే వైఎస్ జగన్ రఘురామ కృష్ణంరాజు ను అంత తేలిగ్గా ఎందుకు వదులుతారు అన్న చర్చ నడుస్తుంది. అదీగాక పనిగట్టుకుని జగన్ బెయిల్ రద్దుకు సుప్రీం కోర్ట్ తలుపును రఘురామ కృష్ణంరాజు తట్టిన తదుపరి ఇలా చూస్తూ ఉపేక్షించకూడదనే జగన్ సర్కార్ చర్యలకు దిగిందన్నది ఆ పార్టీ వర్గాల టాక్. మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం మరికొద్ది రోజుల్లో కరోనా సెకండ్ వేవ్ ను మించి తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుండటం విశేషం.